మాతృదేవో భవ పితృ దేవో భవ
జన్మనిచ్చి, లాలించి, పాలించి,
అడిగిందల్లా అందించి, అలరించి
ఏడ్చినప్పుడల్లా బుజ్జగించి,
వేధించినప్పుడల్లా దండించి
పెంచిన మమకారం
ఓ అయ్య చేతిలో పెడితే తరిగిపోతుందా ?
వారి ఋణం తీరిపోతుందా ?
బాద్యత బరువు సమసిపోతుందా ?
వాత్స్యల్యం వడలిపోతుందా ?
భర్త ఎలాంటివాడైనా తప్పని బాద్యత
నచ్చిన సహచర్యం, మెచ్చిన సంసారం అయినా
బంధం మరుగున సమాజ సూత్రాల
బరువును మోస్తూ , కౌటుంబిక వ్యవస్థలో
ఇముడుతూ పెనుగులాడుతున్న
బిడ్డను
అక్కున చేర్చుకునే అవకాశం,
ఓదార్చే ప్రయత్న౦ , ఆదుకునే అవసరం
తల్లిదండ్రుల బాద్యత కాదా?
జీవన ప్రయాణంలో ఒక భాగం వరకు
మాత్రమే మ్రోసే బరువు ఏల?
సగదూర౦ వరకే నడిచే తోడు ఏల?
ఆదిలోనే బాద్యతల భారం ధరించనేల ?
చేరని తీరాలకు ప్రయాణ ఆరంభమేల?
అనాధలా వదిలివేసే ప్రయాశ ఏల ?
రెండు తీరాల మధ్య ఒదిగే వెలది
గోదావరిలా ప్రవహిస్తుంది ?
తీరాలే ఇంకి కనుమరుగైతే
ఆవేదనా తరంగిణి అయి ఉప్పొంగుతుంది.
Parent Counselling
Nice one
రిప్లయితొలగించండి