27, నవంబర్ 2017, సోమవారం

SECOND COMING




Excuse Me
Please come back
Never would I hurt you
Never would I say a word against you
Never ever would I fight with you

I vow to you on sacred fire
I will be polite always
I won't blame you for anything
Nor cross my limits

Life is
Dull, Colorless & Empty
Without your guidance 

We will always
Have healthy discussion
In the premises of spirituality
I have lot to learn yet
Without pestering you

వెన్న ముద్దలతో యశోదమ్మ
వెనక్కి పిలిచింది అలిగిన
నంద కిశోరుణ్ణి

రుక్మిణి కొలిచి పిలిచింది
 తులసి దళాలతో ఏలుకునే 
జనార్ధుణ్ణి

రాధ వలచి పిలిచింది
 వేణువు పెదవులతో ప్రేమించే
మాధవుణ్ణి

 చిడతలతో  పిలిచింది
చైతన్య ప్రభు భక్తి
పరవశించే కృష్ణుణ్ణి

శరణాగతితో పిలిచింది
ద్రౌపది ఆర్తత్రాణ పరాయణున్ని
నారాయణుణ్ణి

నే నిన్నెలా పిలవాలో నిర్ణయించు
నా పరిధిని నా బాధ్యతని
నా ధర్మాన్ని వివరించు
గురువువి నువ్వని నిరూపించు

జనావళికి మన బంధాన్ని
ఒడంబికని  విశదీకరించు


18, నవంబర్ 2017, శనివారం

DIVINE LOVE


పసితనపు అమ్మ నాన్న ఆట గుర్తుతెచ్చింది
నేను శివుడంటే నేను పార్వతిని అనే పెంకితనం
గడుసుదనం, అల్లరి చిలిపితనం

ఎన్నో ఏళ్ళ పరిచయం ఉన్నట్లు
అన్నీ మరచిన ఆ నమ్మకం
చిత్ర విచిత్రం

మదిలో దిగ్బంధన చేసినా పొగమంచై
సుతిమెత్తగా స్పర్శించి మది నిండా
అలుముకున్న రూపం

ఆ హృద్య భావన పదాల కూర్చితే
పాపమనే  అపరాధ భావం
భవ భయ కారణం

ఒక్కొక్క క్షణం  ఎవరెవరెక్కడ అని ఆచి తూచి
పరిస్థితి నెమరువేసుకుని వ్యథతో
వెనుకంజ వేసిన వైనం

మరలిన కాలగమనం గతానికై
వెతుకులాటకా !
మలి సంధ్య జీవనానికి
ప్రస్థుత సుందర స్వప్న
చేయూతకా !

ఒక కన్నీటి చుక్క నిరీక్షణ
ఒక వేగవంతమైన హృదయ స్పందన
రాలిపోయే పువ్వా
 నీకు తొలి పొద్దు రాగాలెందుకే
అని ప్రశ్నిస్తుంటే !
మలి పొద్దు రంగులు కరిగి చెరిగి పోనీయకే
అని బుద్ధులు నేర్పుతుంటే !

కొన్ని పారేసుకుని కొన్ని వొదిలేసుకుని
జ్యోతిని నేనైనా వెలుతురికై  అన్వేషించే సమిధనై
ఈ నిరంతర పయనం

అరమరికలు లేని స్నేహమై నిలిచి
platonic ప్రేమగా ఒదిగి
లింగ బంధాన్ని సుందరంగా
 మలుచుకోగలిగే సంబంధం
స్త్రీ పురుష అనుబంధం

అణువుల ఆకర్షణ ఎక్కువైతే
అతి చేరువైతే Annihilation ప్రమాదం
అస్థిత్వానికై  పోట్లాట అనివార్యం
వికర్షణ వేర్పాటు సహజo 

Ionic , Covalent  or Coordinate  bonding

 - ఏదో రకమైన bondage అయితే
Emancipation ఎలా సాధ్యం
No commitment వల్ల సుసాధ్యం

అనితర సాధ్యం ఏముంది భువిలో 
ఐనా  ప్రకృతి సిద్ధమైన స్వభావానికి
మనస్సు ఎందుకు వ్యతిరేకం
Commitment మానసిక సౌందర్యం
 కానీ  ఒకరికి  సౌకర్యం మరొకరికి అసౌకర్యం
మొత్తానికి, ముదిరితే రోగం
philosophers & psychologists కి

కానీ కాస్త లోతుగా ధ్యానిస్తే  వేరే కారణం
దైవాన్ని పొందటానికైనా  కావాల్సిందే
ఈ వీడని వ్యామోహం

గులాబీ పెదవులను తాకి
తొలి మంచు చిరునవ్వులో కరిగి
కిరణాల నులివెచ్చని చూపులలో ఒదిగి
ఆకాశ వదనంలో
చిదంబర రహస్యాలెన్నో కోరి
మబ్బుబుగ్గ  సొట్టలో తేలియాడి
అందాలన్నీ ఆస్వాదించాలనే ఆర్తి
ఆ దివ్యానుభూతి పతి, ప్రకృతి ,
 శ్రీశైల శ్రీశివుని చిత్తరువు   
 తోడ తాదాప్య విలీనం
పరవశ అద్వైతం 

ఉట్టి అందనిది ఆకాశమందునా !
శివశక్త్యానుభూతి,
ధనఋణ ఐక్యతకు ప్రతీకమైన
స్త్రీ పురుషుల ప్రేమ యందు పొందనిది 
శ్రీ చక్ర బిందు సంగమం మందు అందునా   !
దైవస్వరూపం దొరకునా !

కామం మొహం ప్రేమ
అన్నీసమన్వయ పరచి
 ఓ మానవ స్వరూపానికొసగినా
అదే వ్యక్త ద్వైతం , అవ్యక్త అద్వైతం
దైవమందు ఐక్యమైనా అదే అద్వైతం
అమలిన శృంగారం













Related Posts Plugin for WordPress, Blogger...