మృదుకరస్పర్శలో ఆప్యాయత స్నేహం
దూరం కూసింతైనా తోడుగా నడిచే
సాహచర్యం స్నేహం
సాహచర్యం స్నేహం
విషాద జీవన ఘట్టాలు మబ్బులై వర్తమానాన్ని క్రమ్మితే
భావిష్యత్తుపై ఆశను చిగురింపజేసే
సన్నిధి స్నేహం
సన్నిధి స్నేహం
నిండని పుష్పక విమానం స్నేహం
చెలియస్థానం సుస్థిరమైన
హృదయ పీటం స్నేహం
హృదయ పీటం స్నేహం
నిరంతర ప్రేమప్రవాహం స్నేహం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి