12, నవంబర్ 2013, మంగళవారం

ANDAM



అందం ఓ ప్రశాంత మౌన సరోవరం                   

మానసానందం ఆహ్లానందకరం 

ప్రేరణాత్మక త్రివేణి సంగమం 

మనశ్శాంతి, మనోధైర్య , మనోనిగ్రహం 

ఆ  సౌందర్య వీక్షణం  ఈ త్రిగుణ లభ్యం 

సుగమం 



అందం ఓ జాలువారే జలపాతం 

శిఖరాలను డీకొనే నర్తనం   

అయస్కాంత ఆకర్షణం 

మానసిక సమ్మోహనం 

బుద్ది వశ్యం  ఆ సౌoదర్య  వైనం   

సంద్రాన బిందువు ఐక్యం  అయ్యే 

చందం 

  

  

23, ఫిబ్రవరి 2013, శనివారం


                                         పనిమనిషి 

PM ని చప్రాసి  అంటే జనానికెంత కోపం 
పనిమనుషులు, చప్రాసీలు అంత లోకువేం 

దేశానికి PM ఓ నెలరోజులు ప్రక్కదేశానికి వెళ్ళితే మనకేం పర్వాలేదు 
కాని పనిమనిషి మూడు రోజులు ఊరేడితే ఉంటుంది తమాషా 

వేళకి కూడుండదు పైగా శ్రీమతి కస్సుబుస్సులు 
అంతా అస్థవ్యస్థం అగమ్య గోచరం 

బాబోయ్ పనిమనిషి 
పనిమనిషి రాదుటండి,  ఇంటికి రాగానే పెద్ద సమస్యా  పూరణం 

 జీవితం ఓ రణరంగం అన్నదెవరు మరిచేపోయా 
పనిమనుషుల వేట మనకిదేం ప్రారబ్ధం 

ఉన్నత పదవులు పెద్ద చదువులు గోప్పప్రపంచం అంతా
 పనిమనిషి   హట్టాత్ సెలవు ముందు దిగదుడుపే 
అదే మనకైతే పై ఆఫీసర్ ఎందుకు ముందే permission తీసుకోలేదని నిలదీస్తాడు శిలువేస్తాడు 

మరి పనిమనిషైతే  అడగనే కూడదు 
జీతం పెంపు పనితీరు అంతా వారి ఇష్టం , ఇష్టారాజ్యం 
పైగా మేము మనుషులమే అనే నినాదం 

వారి వాగ్ధాటికి చేతి వాటానికి అవలీలగా పని సర్దేసే నైపుణ్యానికి 
ఇల్లు అప్పచెప్పి నిశ్చేష్టులై కూర్చోవాలి,
 instructions నాట్ టు బి గివెన్ 
మాకు తెలియదా ఏంటి, ఊరకే చేబుతారేoటి తిరిగి మనకే వాయింపు

చెత్తే వేయకుండా ఇల్లు, తక్కువ గిన్నెలతో వంట, మురికే లేకుండా బట్టలు ఉండాలని మనకు ఉద్బోధ ఇలా ఉంటే ఇంక నీ గోలెందుకు గొంతు దాటి రాని మన బాధ  
  
ఇంట్లో వస్తువులు గాయబ్ అయినా మనం గప్ చిప్   
అడిగితివా అంతే సంగతి గొడవ మరో పనిమనిషికై వెతుకులాట 
పైగా కాలనీ అంతా మారుమ్రోగే అమాయకురాలిపై నేరం మోపామనే నీలాపనింద  

వేళకి చాయ్, అయ్యో పనిమనిషికి ముందు ఇవ్వాలండి అది వెళ్లిపోతుంది 
సరే ముందు దానికి తగలడి తరువాత నాకు కాస్త పొయి  
ఇక్కడ తిష్ట వేసుకుని  కూర్చుంది  నేనేగా స్వగతంలా  యజమాని వెళ్ళ గక్కుకునే ఖైధీ బాధ 

మిగిలిన పొడిలో కాస్త నీళ్ళు పోసి   టీ కాసిచ్చె  రోజులు పోయాయి
ఏoటమ్మ ఈ టీ ? నీకు పెట్టడం రాదా ఏంటి ? 
మేము మీకంటే చాలా చక్కగా చిక్కగా పెట్టుకుంటాం అని నిలదీసే రోజులొచ్చాయి  

పండగ   సాయంత్రం ఇచ్చినవన్నీ పట్టుకెళ్ళే  రోజులు పోయాయి 
మాకూ పండగలున్నాయి ,  మేమూ పండగ చేసుకోవాలి 
పూజలు , గుళ్ళు మాకూ అవసరమే అనే 
పండగ డుమ్మా వారి బర్త్ రైట్  
పాపం పండగ అల్లుళ్ళకి మాత్రం అత్తగార్లె పనిమనుషులు 

ఇలా రకరకాలుగా మనమంతా అవడంలేదు పనిమనుషులు?
PM అంటే ఫస్ట్ మినిస్టర్ , అంటే సిసలైన అర్థం డిక్షనరీ చూస్తే తేటతెల్లం 
వోట్ వేసే మనమే చప్రాసి అయినా అంతకంటే గొప్పే డెమోక్రసీ లో



ఏ depreciation కి లొంగనిది , hikeలు  తప్ప తరగనిది తగ్గనిది పనిమనుషుల జీతం 
పేపర్ పై లేని, earned లీవ్స్ లేని ,పరిమితి లేని CL'S  వాళ్ళవి 
వాళ్ళ గడుసుదనం ముందు మన తెలివి హుళక్కే 
 పనిమనిషి బలహీనతై  వేటు వేస్తుంది 
సమయాభావము బద్దకము అనారోగ్యము వెరసి పూర్తిగా వారిపై ఆధారపడేట్టు  చేస్తుంది 
అవసరం మన నోరు మూయిస్తుంది ,
 కుక్కిన పేనుల్లా పడి  ఉండేటట్లు మనని మారుస్తుంది unregistered, unofficial, జనపదులలాంటి పనిమనుషుల సంఘం   

రోజులు మారాయి, స్థితిమంతుల తిక్కలు కుదిరాయి 
పనిమనుషుల హక్కులు పెరిగి ముదిరాయి 

ఎందుకొచ్చిన గోల, ఏ పనిమనిషైనా ఇదంతా విని కేసు పెడుతుందో ఏమో,  
భారత స్వతంత్ర దేశంలో వాక్ స్వతంత్రం సరే, రాతలో స్వెచ్చకూడా  నీరుగారిపోతోంది 
బ్లాగ్ లో ఏదైనా రాయాలన్నా  భయపడే రోజులోచ్చాయ్ మరి       
తస్మాత్ జాగ్రత్త  జాగ్రత్త. 

  

    


Related Posts Plugin for WordPress, Blogger...