గతం తాలూకు నిశీధి నీడలు
ప్రస్తుతం పైన ప్రసరించినప్పుడు
వ్యక్తుల వ్యథలు రూపం దాల్చి
అపరిచితుల మూసలోకి ఒదిగి
సంకోచి౦చే ప్రక్రియ Transference
జీవిత రహదారి వ్యూ మిర్రర్ లో
ప్రతిఫలనం చెందే అచేతన, పొగమంచు రూపంలో
మసక మసకగా అగుపి౦చే చిత్రమే Transference
అచేతనా ఆధిక్యతతో, చేతనా వ్యవస్థను అణచి
ఆలోచనా తరంగాలను అధిగమించి
మన ప్రస్తుతాన్ని, భవిష్యత్తును ప్రభావితం చేసే
మానసిక రక్షక తంత్ర౦ Transference
అంతగా పరిచయంలేని మనుజులు కూడా
మనోభావంలో భంధువులలా , సంబ౦ధీకులలా
ప్రకటితమయ్యే విపత్కర స్థితి Transference
సైకోధెరపి ప్రతిభావంతమైన ముద్దుబిడ్డ
నైపుణ్యం వెల్లివిరిసే కళాశిల్పం
మానసిక వ్యథలనుండి విరామాన్ని
విశ్రామాన్ని అందించే చర్య Transference
ఎవరు , ఏమిటి, ఎలా , ఎందుకు, ఎప్పుడు వంటి
పలు ప్రశ్నలకు సమాధానాలు
తెరపిస్ట్ లో సంగమించినప్పుడు
జీవన జ్యోతి రక్షణ౦
అంతరంగ సమతుల్యం, మనశ్శాంతి సాఫల్యం
జీవితం సాంతం ఆనందడోలికలూగ
సాంగత్య ఫలం, స్వర్గ తుల్యం
Transference
Transference
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి