22, మార్చి 2024, శుక్రవారం

                           ఇరువైపులా నిలువెత్తు  నిజం 

    

ఒకరు వ్రాసిన write up చదివాక అందులో పదాలు గమనించిన  నాకు తట్టిన సరిజోడు  పదాలు 



            

                తన  పదాలు                                                                                                                                              నా  పదాలు 

 

1. ఏ మనిషి సంతోషంగా ఉండలేడు 


 

1   కణం  అమరిక 


 2 మనసుల్లో విభజన గుణం 


 

2  కణ విభజన 


 3 పోటీతత్వం 



3 ఎదుగుదల 


 4 ప్రేమ మంచితనం నటన 


 

4 వ్యక్తి / వ్యక్తిత్వం 


 5 మానసిక హింస 


 

5 సమిష్టి కృషి 


 6 మానసిక శత్రుత్వం 


 

6  సంఘం / సమాజం 


 7 ఆంతరంగీక  విద్వేషాలు 



7 ప్రపంచం 


 8 పేరెంట్స్ హింస 



8 భూగోళం  ఖగోళం 


 9 అప్పులు వడ్డీలు 


 

9 సౌర మండలం 


 10 ఆధిపత్యం 


 

10 పాలపుంత , అనంతం 

   

   Narrow view                                    Broad View                                                   

ప్రేమను  సంకుచితం                 ప్రేమను విశ్వ వ్యాప్తకం       

చేసే పదాలు                                      చేసే పదాలు 

Reveals                                                    Reveals 

Anger                                                      An Eagle View 

Frustration                                              Encompassing 

Blues                                                        Wholistic / Holistic 


కృత్రిమ విభజన సహజ ఐకమత్యానికి  దారి వేస్తుంది 



 

29, ఆగస్టు 2023, మంగళవారం

Naana ....Nenu

                                                     నాన్న - నేను 


అందరూ మాతృదేవో భవ అంటూ తల్లినే శ్లాఘిస్తారు 

నవమాసాలు మోసేది తల్లి కాని 

ఆ నవ మాసాలు ఆ తల్లి తో బాటు తన బిడ్డను కాపాడుకునే 

పోషించే తండ్రిని అందరూ దాదాపు మరిచిపోతారు 


అమ్మ కమ్మని మాట మరి  

నాన్న ప్రేమ నిండిన మూట అనురాగపు బాట 

మృత్యువు అమ్మని దూరం చేస్తే 

విధి నాన్నని దూరం చేసింది 


దాదాపు పదేళ్లు నాన్న దగ్గర లేకపోయినా 

అతను నేర్పిన ఎన్నో విలువలు 

నన్ను ముందుకు నడిపించాయి 

నాన్న ఒక మహావృక్షం 

నాన్న మహామనిషీ ఎంతో సాధించాడు 

ఇలా చెప్పుకోవడానికి  ఏమి లేవు కాని 

తన ఉద్యోగ నివృత్తిలో ఎంతో 

నిజాయితీ పరిపూర్ణత చూపించాడు

నాన్నని చూసి అతని ప్రవర్తన ద్వారా నేర్చుకున్నవే ఎక్కువ 

ఏది చెప్పినా నాలుగు మాటలలో జీవిత సత్యాన్ని విలువలని 

అతి సుళువుగా ఏదో ఒక నానుడిలేదా 

సామేతతో జోడించి చెప్పేవారు . 

నాన్న ప్రశాంతత నిర్మలత్వం మంచితనం సహనం

 నిరంతరం నన్ను స్పర్శిస్తూనే ఉంటాయి

నాన్న వెళ్ళిన తరువాత కూడా తాను ఉన్నట్లే 

భావ పరంపరలు వైబ్రేషన్స్ కలుగుతాయి 

నాన్నకి ఎంతో ఓర్పు అమ్మలో 

ఎప్పుడూ నే చూడని ఓర్పు నాన్నలో కనిపించేది 


నాన్న Archeologist గుళ్ళు ఊర్లు తిరిగేవారు

 అక్కడ ప్రాచుర్యం లో ఉన్న కథలు సేకరించి 

అక్కడి విశేషాలన్ని చక్కగా పూస గుచ్చినట్లు వివరించేవారు 

అలా ఎన్ని కథలు విన్నానో !

ఎన్నో ఏళ్ళ తరువాత  మా పాపకి ఓ సారి కథ చెబుతుంటే 

ఇల్లు చిమ్ముతున్న నేను గడ్డం గీసుకుంటున్న మా వారు

అలాగే చేసే పని ఆపేసి కథ అయ్యే వరకు 

అలాగే శిలలలాగా నిలబడిపోయాము 

ఎవరో "stop" అన్నట్లు  

నాన్న "A Great story  teller " ఇన్నేళ్ల తరువాత కూడా 

అంతే ఉత్కంఠత మాలో కలిగించేలా చెప్పారు 


నాన్న లో కనిపించనిది అహంకారం 

మచ్చుకైనా ఎంత వెతికినా అది  కనిపించేది కాదు 

ఒక రోజు హోటల్లో  డిన్నర్ చేసి  బైటికి  వస్తున్నాము 

డోర్ దగ్గర డోర్ కీపర్ వినయంగా నమస్కారం చేశాడు 

సహజంగా అందరూ  అతనికి డబ్బులు ఇస్తారు 

నాన్న మాత్రం అతనికి చక్కగా చేతులెత్తి నమస్కరించారు 

ఆ నిముషం అందరం నవ్వేశాం  doorkeeper తో సహా 

డోర్ కీపర్ కళ్ళలో మెరుపు నవ్వులో కాస్త సిగ్గు తొణికిసలాడాయి 

ఆ తర్వాత నాకు కూడా అనిపించింది 

నమస్కారానికి ప్రతిగా చేయాల్సింది నమస్కారం కదా 

మరి ఈ దండానికి డబ్బుకి ముడి పెట్టడం అవసరమా ?

అందరం మనుషులమైనా ఒకరిని దండం క్రిందికి జార్చి చులకన చేస్తే 

దానం ఒకరిని పై మెట్టున నిలబెట్టి స్థాయి పెంచుతుంది 


డబ్బు కోసం నమస్కారం 

డబ్బుకి నమస్కారం 

అంతటా నివసించే పరమాత్మకి నమస్కారం 

ఎదుటి వ్యక్తిలో భాసిల్లే ఆత్మారామునికి నమస్కారం 

ఇందులో ఏది ఉత్తమమైన నమస్కారం 

ఇది అర్థమైతే 

నాన్న ఉత్తమమైన సంస్కారం అర్థమౌతుంది 

మనుషుల మాటలలో అవమానాన్ని వెతికే వారు కాదు 

వాళ్ళ మాటలు వారి స్వభావాన్ని,

 పరిస్థితిని , తెలుసుకునే  అవకాశంగా భావించేవారు 


నేను నాన్నకి ఎన్నో చెప్పేదాన్ని 

నాన్నకి ఏమి తెలియదు నాకే అన్నీ తెలుసనుకుని 

నే చెప్పేవి అన్నీ వినేవారు 

"గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందని "

ఇదేంటి నాకు చెప్పేదేంటి 

అని ఎప్పుడూ అనలేదు , అనుకోలేదు 

ఎవరు ఏది చెప్పినా దాంట్లో 

సత్యాన్ని మాత్రమే వెతికే నిరహంకారి 


నాన్నని నేనేమైనా బాధ పెట్టానేమో అని 

మనస్సు చివుక్కుమనేది 

అడిగితే నేనేమి బాధపడలేదులే అని 

నా గిల్ట్  ఫీలింగ్స్ ని కూడా తుడిచిపెట్టేసేవారు  


ఎంత చక్కటి నాన్న 

అందరికీ ఉండనటువంటి నాన్న 

కొందరికి మాత్రమే ప్రాప్తమయ్యేటటువంటి నాన్న 

నాకు నాన్న 

I feel so proud of him and myself 


అమ్మ  తన నలభై తొమ్మిది ఏళ్ళ వయస్సులో 

 ఉన్నట్లుండి 

మృత్యు కుహరంలో మాయమవడంతో 

విధి మా కుటుంబాన్నిసుడిగుండంలోకి నెట్టివేసింది

 నాకు అప్పుడు ఇరవై మూడేళ్లు ,

తమ్ముడు  పదునెనిమిదేళ్ళ వాడు 


మనిషి ధైర్యాన్ని తెలుసుకోవాలంటే 

 జీవితంలో జరిగే దుర్ఘటనలప్పుడే గమనించాలి 

ఇరవై ఐదేళ్లు సహజీవనం చేసిన తన ప్రియధర్మచారిణి 

ఒక్క మాటైనా  తెలుపకుండా వీడుకోలు తీసుకుంటే 

కంట నీరు పొంగకుండా గుండె నిబ్బరంతో తన కర్తవ్యాన్ని పాటించారు 

అందరికి అలా నిలదొక్కుకోవడం సాధ్యం కాదు 


కొందరు ఆశ్చర్యపోయారు కొందరు ఇదేంటి విచిత్రం అనుకున్నారు 

కొందరు భార్య మీద ప్రేమ లేదేమో అని అనుమాన పడ్డారు 

హైందవ వేదాంతం నాన్నకి చేయూత నిచ్చింది 

బాధపడి ఏంలాభం మీ అమ్మ తొందరగా వెళ్ళిపోయింది అంతే అనేవారు 

నాకు అవసరమైన కష్ట కాలంలో చేదోడు వాదోడుగా సహాయపడ్డారు 

అమ్మ లేదనే కొరతని తగ్గించాలనే ప్రయత్నించారు

 చాలా మట్టుకు సఫలీకృతం చెందారు 

కానీ ఎంతైనా కొన్ని పరిస్థితులలో  అమ్మ అమ్మే 

అమ్మ లేని లోటు నాన్న పూర్తిగా తీర్చలేరు 


ఇలా వ్రాసుకుంటూ పోతే నాన్న గురించి 

నా గురించి ఎంతైనా వ్రాయొచ్చు . 


24, ఆగస్టు 2023, గురువారం

Mysterious Musings

 Mysterious Musings 


Oh dear when will you run freely in the meadows 

by your mother grazing aside 

and you loitering by in the fresh air 

watching the big blue sky 

with white clouds spread throughout  the vastness 

hearing the bells tingling around your neck and legs 

smelling scented red soil diffusing throughout in the moving wind 

ur' big beautiful eyes looking all around 

searching for someone or something 

ur' galloping hooves dancing here and there and everywhere 

lovely calf 

Why don't you come out of that boring cow barn  

 tied in the caged stall of dirt and untidiness 

swarm of flies flying around 

Don't be like us humans

 not wondering about the nature 

only using each other 

throwing away the trash but living in the filth of minds 

heights we reach but destroying everything and everyone 

on the way to the materialistic gains 

Oh my dear calf

 my eternal soul 

run into the unknown mysterious terrains 

for freedom in the love of God 


11, ఆగస్టు 2023, శుక్రవారం

Teachers Factory

కర్మాగారంలోకి ముడి సరుకుతో బాటు 

 income కూడా వస్తుంది

 product మాత్రం తయారు అవడం లేదు 

 కేవలం అదే material బైటకు  సమాజం లోకి వెళ్తుంది 

 కాని guaranteed product అనే stamp తో   

అసలుకే ఎసరు పడుతుంటే   

నాణ్యత  గోవిందార్పణం అని వేరే చెప్పాలా ?

 నును లేత బాల్యం పై , adolescence పై

 దీని ప్రభావం ఏమిటో   

 ఆ గారంటీడ్ ప్రోడక్ట్ 

human resource అయితేనో 

human investment అయితేనో 

దీని పర్యవసానం ఏంటో 

human capital గతి ఏంటో 

దేశ ప్రస్థాన పరిస్థితి ఏంటో 

 London  school of Economics 

 LSE product 

 మాత్రం చెప్పగలరేమో ! 

8, ఆగస్టు 2023, మంగళవారం

sky Garden

   

                                      మబ్బు పూలు 

ఆకాశం తోటలో మబ్బుపూలు 

ఒక్కొక్కటే తెంపుకుని

 నా కొంగులో నింపుకుని 

రోజూ  గుండె గూటిలో 

నిన్ను కొలుస్తున్నా దేవరా !

నీ దయతో నిండిన కనుచూపు 

కొంగున కట్టుకుని 

నా  జీవనయానం  కొనసాగిస్తున్నా 

మాదేవా ! 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

5, ఆగస్టు 2023, శనివారం

HAASYAM .....With Due RESPECT intended

                        నిశ్శబ్ద తరగతులు


నిశ్శబ్ద తరగతులలో   

శబ్దం కోసం 

విరహంతో విలపిస్తున్నా !😔

 

అనాథ ప్రేతాల్లా స్టాఫ్ రూమ్ లో 

ముచ్చటగా ముగ్గురం 

ముచ్చటైన ముగ్గురం ! 👽👽👽


ముచ్చట్ల మురిపం తీరే లోపే

సమర నాదం  యుద్ధ వాదం

విత్తు ముందా చెట్టు ముందా !😌


బొమ్మ వేస్తే బొరుసు  

బొరుసు పడితే బొమ్మ 

బొమ్మా  బొరుసా ఆలోచించే లోపే 

కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి !😟


ఏమి చేయాలో తెలియని అయోమయం 

సహకరించని సాయుధ గణం !

డిస్కషన్ ఆర్గుమెంట్  అయ్యే లోపే

క్రింద హాల్ లో  సెలబ్రేషన్ 

కర్ణభేరి భరించలేని  ఢమరుక నాదం !

అంతలోనే 

ఒకరికొకరు ఇచ్చుకునే సాంత్వన 

అటుపై నిశ్శబ్ద వీచిక !💔💙


ఆడవారు మాట్లాడుకోనే  వద్దు 

నెగిటివ్ గా ........  రెడ్డిగారి హెచ్చరిక 

పాజిటివ్ గా  అత్తగారింటి గురించి 

ఏ కోడలైనా మాట్లాడిందా ?

మాట్లాడినా ఆడవారి మాటలకు 

అర్థాలే వేరులే 

సగం నిండు అంటే సగం ఖాళీనే 

 పాపం పండిన పండు 

 పాపం పరేషాన్ !😀😝


ఎవరిని ఎవరు పరిపాలిస్తున్నారు 

సైన్న్యాన్ని సామ్రాట్తా ? 

సామ్రాట్టుని సైన్యమా ?

లేదా 

అందర్నీ అధిరోహించి స్వారీ చేసి, 

ఉపాధ్యాయుల్ని తయారుచేసే 

కర్మాగారాన్ని, భర్తీ చేసే 

సైన్యాధ్యక్షుడా పరిపాలన గావించేది ? 🙆


రోజులెలా గడుస్తున్నాయో 

ఆకసాన్ని అడగాలి వంగి నేలను 

స్పృశిస్తున్నావేంటి అని 

SPIRITUALITY & MATERIALISM 

ప్రతీసారి అవి కలిసే చోటు 

ఏది నిజమో ఏది మాయో 

ఎవరు గురువో ఎవరు శిష్యులో 

తెలియని 

నాతో నేను, నాలో నేను 

నిరంతర ఘర్షణ సంఘర్షణ !😨


                           హే భగవన్ 

జిందగీ హర్ కదం ఏక్ నయి జంగ్ హయ్ 

జీత్ జాయేంగే హాఁ అగర్  తూ సన్గ్ హై

                               🙏🙏🙏            

                https://youtu.be/m-ZOReY92p0

                                              🙈🙉🙊

           

22, జులై 2023, శనివారం

????......

 

ఏమి జరిగిందంటే ఏమి చెప్పను !


సుడిగాలి ఉధృతానికి విరిగిన శకలాలని 

నేల కొరిగిన శిధిలాలని నెమ్మనెమ్మదిగా 

ఒక్కొక్కటే ఏర్చి పేర్చుకుంటున్నానని చెప్పనా !


విరిగిన శకలమే కదా అంటావేమో

 అది నా ఆత్మస్థైర్యమని నీకు తెలియదా ?

ఆ శిధిలాలలో నేల కొరిగిన 

నేను అనే నా అస్తిత్వం నీకు కనిపించలేదా ?


నీకు ఎలా తెలుస్తుందిలే ? బలహీనత 

నీ కళ్ళకు గంతలు కట్టింది కదా !

మనసు మరుగున మృదుత్వం  

కారుణ్యరహితంగా  కాఠిన్యాన్ని సంతరించుకుంది కదా !


నేను చేసిన తప్పేంటి ?

 నన్ను నేను 

ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నా 

ఎన్నెన్ని వేళల నిలదీసుకున్నా 

అనంత సూన్యం బావురుమన్నది 


విలువలు అవసరం లేదంటున్న సమాజాన్ని

 ఇవిగివిగో వీటిని పాటించమనడం 

ఎంతటి నిర్హేతుకం !

నిశ్చయమే లేని  గమనానికి 

గమ్యం విడమరచి వివరించడం

 ఎంతటి నిశిద్ధం !


ఓ బాటసారి బాట నీది గమ్యం నీది 

గమనం నీది కానీ స్వప్నం నాది 

అందుకే నా స్వప్న విరచిత 

నవ గీతికలకు ఈ నీ అపస్వరాలు 

అందుకే నా స్వప్న విరచిత 

నవ సాదృశ్యానికి ఈ నల్లటి రంగుల మరకలు 

ఒక జీవితానికి  సరిపోయేటంత కన్నీటి వరదలు 

చివరి వరకు మిగిలిపోయే తుషార చారకలు 


సుడిగాలి వెళ్లిపోయిందని సంతసించనా 

తను పేర్చిన అక్షర నష్టాన్ని నెమరు వేసుకుని 

లెక్కకట్టి పరితపించనా ?

అక్షరాల గాయాలు నిరంతరం బాధిస్తుంటే 

మందే లేని కాలంతో పయనించనా ?


మానని వ్యథ మారని మనిషి 

తీరని దాహం సమాధానమే లేని ప్రశ్న 

నన్ను ఈ నిర్గమనమైన దారిలో  

 అందరికి అగుపించని పూతోటలో 

అంతర్ పయనంలో ఆత్మ శోధనలో 

నిస్సంగత్వం తోడైన శాంతి బాటలో 

నడిపిస్తుందని తెలుపనా !


సమాజ స్రవంతి తీర్చని దాహార్తి 

నాలో అంతర్వేది తీర్చిందని చెప్పనా ?

 


గురుతర బాధ్యత -----బోధకుని నిరంతర వ్యథ 

వికలమైన విద్యా వ్యవస్థ ------పతనమయే విద్యార్ధి దిశ 


Transference Potential

 వ్యక్తులు వేరు వ్యక్తిత్వాలు వేరు 

ఆలోచనలు వేరు అస్తిత్వాలు వేరు 

ఏ మాయో రెంటిని ఒకటిగా భ్రమింపజేస్తుంది 

oozing with transference potential !


చాలా అసహ్యంగా ఉందీ పదం 

పాలిండ్లలో పొంగి పొరలి నిరుపయోగమై 

శక్తి విహీనమైయే తల్లి పాలలా 

చాలా జుగుప్త్స కలిగిస్తుందా పదం !


పరిచయానికి  అపరిచయానికి తేడా ఎంత ?

మనుషులను మూసగా పోసి 

వర్గాలుగా భేధించే వారికి 

చాలా తక్కువ 


ఇది పరిచయమా అపరిచయమా 

 తెలియని సందిగ్ధత 

పార దర్శక లక్ష్మణ రేఖ 


వ్యక్తికీ వ్యక్తికి మధ్య ఉండే 

ఎన్నో సున్నిత భావాలను 

emotions అనే ఒక తాటి క్రిందకి 

చేర్చేవారికి 

అపరిచయం పరిచయం అవడంలో 

మాధుర్యం  తెలియదు 


రంగుల రాట్నం తిప్పేవాళ్లు  

ఒకరి తర్వాత ఇంకొకరికి 

injection పొడిచే నర్సమ్మ 

అదే పాఠం ప్రతి పిల్లవాడి దగ్గర

 ఒప్పచెప్పించుకునే పంతులుగారు

 గుర్తుకువస్తున్నారు 


Genuineness  in  feeling, sincerity in expressing  

daringness  in accepting,  frankness in revealing &   

empathy in understanding are not everyone's qualities  


                                                                                        

                                                                             " People oozing with transference potential" 

                                                                                      the term used  by Sigmund Freud 

                                                                                      in his Psychotherapy  




18, జులై 2023, మంగళవారం

Refraction

                

                                         పరావర్తనం 

గతించిన కాలవాహినిలో జ్ఞప్తికలు దీపికలై  

స్వీయ చరిత్ర పై వెలుగులు ప్రసరిస్తుంటే 

నిశిలో నీడకై  వెతుకులాట 

నిరర్ధక నిరపయోజనాలై

 నిజం కేవలం నేడే అంటుంటే  

ఓ రూపం  అజరామరమై 

కలకాలం నిలుస్తుందనుకుంటే 

చెదరి రూపురేఖలు వేరైన  సారూప్యత

 కొనసాగింపై  

ఆగర్భతిమిరాంధకార గుహలో 

వెలుగై  దైవమై 

వెలసిన  ప్రతిబింబము చెరగనీకుమా 

కాలగమనమా !  చిత్తచాంచల్యమా !            



9, జులై 2023, ఆదివారం

PRATHI SRUSTI

              
                                                                     ప్రతిసృష్ఠి 


                భావనలు వర్షిస్తే మనసుల్ని స్పర్శించే 
  
                మృదువైన కవిత కలం నుంచి జాలువారితే 
                   
                భువి ఆసాంతం జయించిన 

                  కవి హృదయస్పందనం  

కనులను  చేరిన క్షణం లోనే 

 రంగులద్దుకున్న కుంచె 

మనోనేత్రసౌధాలలో తివాచీలై  పరుచుకున్న 

బహు సుందర వర్ణ చిత్రం చిత్రీకరించి 

సౌందర్య సామ్రాజ్యానికి కిరీటం లేని

మహా రాజై విరాజిల్లు  

చిత్రకారుని నయన లాస్యం 


                                                  స్వరతరంగాలలో తేలియాడుతూ 

                                                   నవ  నాడులను మీటుతూ    

                                                   సప్త యోగ చక్రాలను స్పృశిస్తూ 

                                                   వాగేయ మేరువు ఆశీర్వాదంతో

                                                   గురుని ఆధారంతో  

                                                   సంగీత  సాగర మథనం కావించి 

                                                   కీర్తనల అమృతం చిలికి 


శ్రోతల్ని అమరులని  మైమరపించే 

గాయకుడి తన్మయత్వం 

గంధర్వలోకం పై దిగ్విజయం 

ప్రాప్తించిన  గాన  గాంధర్వ సాధనా సప్తమం   


                                                         రాళ్ళలో రాగాలు పలికించి 

                                                        రసజ్ఞత పొందుపరిచి 

                                                      కంటి మెరుపులు వింటి  విరుపులు 

                                                       నున్నదనం లాఘవంగా  చెక్కి 

                                                         ఉలితో   వివరాలు విశదీకరించి  

                                                              శిల్ప కళతో కట్టిపడేసే శిల్పి 

                           కళాత్మక  జగ్గత్తుని   శ్వాప్ణికమో సత్యమో మనకే మిగిల్చే

                                                           తరతరాలుగా నిలిచే సృష్టి 

                                                    అమోఘ  ప్రతిసృష్టిని   ప్రతిష్టించే

                                                         సుందర స్వరాజ్యాలను 

                                                       గెలిచిన శిల్పి  సజీవ దరహాసం   

                                      

                       పరమానందం ఇటువంటి ఎన్నెన్నో అద్భుతమైన 

                                 మహా సామ్రాజ్యాలలో

                        నెలవై  ఉంటే పదవులకై వెంపర్లాడుతూ 

                        ధనంతో త్వమేవాహం అంటూ 

                          ఆనందం కోసం కరువ్వాచి

                       నలుదిశలా పరువులెత్తుతున్న 

                                    వింతలోకం 



                       

                                                   

Related Posts Plugin for WordPress, Blogger...