29, అక్టోబర్ 2011, శనివారం

Nisheedhi

         
          నలువైపుల నిశీధి 
           వీధి వీధి నిశీధి 
     చీకటి తెమ్మెరల ఆవలి అనంత నిశీధి         
        నిర్గుణం, నిరాకారం,నిస్తేజం మీ నిశీధి   

   రూపు తనలో కలుపుకున్నకారు చీకటి నిశీధి 
      తనలో నలుపు నిలుపుకున్న కాలవర్ణం నిశీధి  
   తనలో నిశబ్దం నింపుకున్న నిండుదనం నిశీధి 
        గాఢత అలుముకున్న గాఢా౦ధకారం నిశీధి 

    రంగు, రూపు కనుమరుగై ఏ రాత లేని నల్లపలక నిశీధి
       అస్తిత్వం పోగమంచై  ఆధ్యాత్మిక  అక్షరంగా మారిన నిశీధి 
    అతివ విసిగి వేసారిన వేదన ఈ నిశీధి 
        మృత్యువు ముసుగు మరుగున మౌనమీ నిశీధి 
     నిశీధి పయనం జీవన యానం  సరళ రేఖలైన 
                 బ్రతుకు చీకటి ఈ నిశీధి 

              ఆ నిశీధి నా చుట్టూ అల్లుకున్న వేళ 
         నాలో  అగోచరమైన ప్రాకృతిక  అచింత్యనశక్తి నిశీధి 
                  నిర్మల చిత్తం నాదైన నిశీధి 
                  మమేకమైన ఓంకారం నిశీధి          
      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...