నిను చేరగలననుకున్నా
కాని అడుగిడబోతూ చూడగా
అదో పెద్ద ప్రపంచం అనంత విశ్వం
ఆ అనంతంలో నీ కోసం నా అన్వేషణ
అది గమనించిన నా మది అంతరాళంలో
భయాన్దోలనల ఉవ్వేత్తు తరంగాలు
అడుగు ముందుకు పడక
వెనుకంజ వేయక తప్పలేదు
ఓడిపోయానని ఒప్పుకోకా తప్పలేదు
క్రోత్తగా గెలుపు వెంట పరిగేత్తే ఓపికా లేదు
మూసిన నీ ప్రపంచం కవాటాలు
నన్ను నా ప్రపంచంలో నిలబెట్టాయి
మాత్రమే తెలిసిన కారణం
నే అడుగిడలేని ప్రపంచాన్ని
నువ్వు వోదులుకుని వచ్చేసావుగా
నా తోడుగా నా ప్రక్కనే నిలిచి ఉన్నావుగా
ఆ మూసిన ప్రపంచ కవాటాలని
ప్రళయమై ఆ ప్రపంచాన్ని కూల్చివేస్తుంది
వెన్నెల రేయిలో నీ చేతిలో నా చేయి వేసుకుని
జంటగా మరలి రాని తీరాలకు
తరలి వెళ్ళే మనమే మిగిలేము భవితగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి