దురదృష్టం మన వెన్నంటే ఉంటుందో
మన కంటే ముందు వెళ్లి మన కోసం ఎదురుచూస్తుందో కాని
ఎప్పుడు ఎక్కడికెళ్ళినా మాకు ఎదురౌతుంది
దేనిపైనా మక్కువ ఎక్కువ ఉండకూడదంటే
ఏమిటో అనుకున్నాము
మన మక్కువ దురధృష్టాన్ని కొత్త ప్యాకేజీలో
అక్కున చేర్చుకునే ఉంటుందని ఇన్నాళ్ళకు
ఎన్నెన్నో శిశిరాల తరువాత తెలుసుకున్నాము
దురదృష్టం ఎదురైన ప్రతీసారి బాధను
అదిరించి, విదిలించి , అదిమి ప్రక్కకి నెట్టేసాము
ఇది విధిలిఖితం దుఖభరితం తప్పని చరితం అనుకున్నాము
అధృష్టం కూడా ఇలాగే ఎప్పుడో ఒకప్పుడు మన టైం బాగుందని
అనుకునేలా చేస్తుందనుకున్నాము
కాని కనీసం యాధృఛికంగానైనా అదృష్టం
ఎప్పుడూ ఎదురుపడలేదు స్నేహమా
అయినా తమరు మాకు ఎదురోచ్చారు
తమరిని ఏ కోవకి చేర్చాలో అర్ధం కాక సతమతమయ్యే మాకు
తమరు నేడు మాకు రెండూ ఒకటేనని తేల్చిపడేశారు
అందుకే ఇప్పుడు అదృష్టం ఎదురవలేదని బాధపడము
దురదృష్టం ఎదురైందని వ్యధచెందము
నిశిలో మినుగురుని వెతికినట్లు
బాధలో సంతసాన్ని వెతుక్కుంటాము
ఎప్పుడైనా అదృష్టం ఎదురైతే సంతసించము
దాన్ని పరిహసిస్తాము నువ్వు దారి తప్పి
మా దారికి వచ్చావేమిటని
నీ దారి కలియుగాన అడ్డదారి కదా
మరి రహదారిలోకి వచ్చావేమిటని
బాధ, వెలితి కూడా సుఖాన్ని అందిస్తూ
పొగమంచులా కరిగిపోతున్నాయి
తమరి రాక ఒక్క వసంతాన్నే తెస్తే బాగుండుననుకున్నాను
కాని శరద్ శిశిరాలని కూడా తెస్తుందనుకోలేదు
అయినా ఎప్పుడు మాకు ఆమడ దూరంలో ఆగిపోయే ఆనందం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి