పదహారు ప్రాయాన నూనూగు మీసాల
నూత్న యవ్వనమున కౌమార వయస్సున
వివాహమాడేవారట అదియే వారి ఆచారమట
కొత్త బంగారు లోకం ప్రాకారం దాటి
అడుగిడే నాటికి బంధుత్వం , బంధము
అనుబంధము , పుష్కలమై మనో వైకల్యాలకు
శారీరిక వికారాలకు లోను గాని అదృష్టం
ఆ కాలం నాటి కౌమారం
ఆధునిక సమాజంలో అన్నీ అందుబాటులో ఉన్నా
ఇంటర్నేట్, సెల్ ఫోన్, ఎంఎంఎస్, చ్యాట్ వ్యవస్థ
మధ్య కౌమారం మరుగైపోయింది
వారి స్నిగ్ధ మనోహర జీవనం కరువైపోయింది
వయ్యస్సును మించిన యోచన
పెడతోవన పడుతుంటే
పిన్న వయస్సులో పెద్ద తరహ ప్రవర్తన
కౌమారంలో నైతిక అంధత్వం , గమ్యం గమనించుకోని నిర్లక్షం,
మేధస్సు మోద్దుబారి తామసానికి బలియ్యే విధానం
మేధస్సు మోద్దుబారి తామసానికి బలియ్యే విధానం
కారణాలు అనేక౦ , చిన్న కుటుంబ వ్యవస్థ
నిరంతర కార్యవ్యస్తులైన పెద్దలు
అన్నిటిని మించిన అజ్ఞానం
సహజాతాలతో పోరాడలేక
సహజం ఏదో తెలియక
నైజం వక్రగతిని ఎదుగుతుండ
సమాజ నిర్దిష్ట నియమాలకి లోబడలేక
అష్టావక్రమై అధోగతి పాలు అయ్యే నేటి కౌమారం
ఆరోగ్యకరమైన అలవాట్లలో ఇమడలేక
లోపభూయిష్టమైన కుతూహలంతో
హానికరమైన వ్యసనాలతో, అగచాట్లతో
కౌమార నిండు యవ్వనం నిరర్ధకం
కౌమారం మరుగై వార్ధక్యంలో అడుగిడుతున్నా
వీడని కౌమార వ్యసన౦
మనుజుని పీల్చి పిప్పి చేసే సాధనం
తొలి అడుగు అమ్మ చేయూత
మలి అడుగు బిడ్డ చేయూత
కాని పూర్తి జీవితాన్ని నిర్దేశించే
కౌమారపు అడుగుకి ఎవరి చేయూత?
స్వచ్చమైన చేయూత కరువై
సమవయస్కుల సహచర్యం
మలి అడుగు బిడ్డ చేయూత
కాని పూర్తి జీవితాన్ని నిర్దేశించే
కౌమారపు అడుగుకి ఎవరి చేయూత?
స్వచ్చమైన చేయూత కరువై
సమవయస్కుల సహచర్యం
కాలుష్య పూరిత వాతావరణం
గజి బిజీ గీతల మనోఫలకం
తమస్వినీ ఘర్భ కుహరాలలో , భీకరారణ్యాలలో
కౌమార జీవన జ్యోతి రక్షణకై నిర్విరామ పరిశ్రమ
సభ్య సమాజ౦ గర్వి౦చే భావి పౌరులకై
భారతదేశ పట్టిష్ఠమైన పునాది రాళ్ళకై నిరంతర అన్వేషణ.
గజి బిజీ గీతల మనోఫలకం
తమస్వినీ ఘర్భ కుహరాలలో , భీకరారణ్యాలలో
కౌమార జీవన జ్యోతి రక్షణకై నిర్విరామ పరిశ్రమ
సభ్య సమాజ౦ గర్వి౦చే భావి పౌరులకై
భారతదేశ పట్టిష్ఠమైన పునాది రాళ్ళకై నిరంతర అన్వేషణ.
Good one :)
రిప్లయితొలగించండి