నన్ను ముంచివేసే నీ వర్షపు జల్లులు ఏవి ?
నన్ను ఉక్కిరి బిక్కిరి చేసే పవనాలేవి?
నా ఆణువణువూ ప్రాకి స్పందింపజేసే
నీ దరహాస మెరుపులేవి?
నా దాహం తీరేది నీ జడివానతో
నీ దాహం తీరేది నాలో పొంగే సముద్రాలతో
నా పై సాగే నదులతో
అహంకారంతో, వీర విజయంతో
నన్ను గెలిచాననే నీ ఉరుములేవి?
మనిద్దరి సంగమ వేళ
నిను నాతో కలుపుతూ మనని
మైమరపించి తరింప జేసే వారధి
పిడుగు ఏది?
అటుపిమ్మట తాదాప్యంలో తృప్తిగా
మనని క్షణకాలం నిదురింపజేసే
ప్రశాంత వాతావరణం ఏది ?
ఇవే కదా కావలసింది సృష్టికి నాంది పలికేందుకు
మరో ప్రాణి ఆవిర్భవించేందుకు
నీ భీజాన్ని నాలో నాటేందుకు
అది పెరిగి నా గర్భాన్ని చీల్చుకుని పైకొచ్చిన వేళ
నీ నీడన నా అండన అది పెరిగి
మహా వృక్షమైన వేళ
నాలో భూగర్భ జలం వృక్షనాళాలలో ప్రహించిన వేళ
అది పుష్పించి , ఫలించి లోకోద్దరణ చేసిన వేళనే కదా
నా యొక్క, నీ యొక్క జన్మలు ధన్యములయేవి ?
ఇట్లు
మీ అవని
. .
మంచి ప్రక్రియ
రిప్లయితొలగించండి