మధుమోహ సాన్నిహిత్యం మధుమేహ ఆలింగనం
వంశపారంపర్య జన్యు పరంపర కారణం
Pancreas కి వత్తిడి ఎక్కువ
Insulin ఉత్పత్తి తక్కువ Tablets ల నిరంతర వాడుక
Diabetologists చుట్టూ అనవతరం ప్రదక్షిణ౦
ప్రతి మాసం blood tests, lab reports ల ప్రహసనంఎల్లవేళలా పరిశ్రమ, exercises , walking ల నిరంతర ప్రయాస
Sweets కవ్విస్తుంటే diet control బెదిరిస్తుంటే నిరతం నిరాశ
నిద్ర తక్కువ ఆకలి ఎక్కువ, వొద్దు వొద్దన్నాతిండి మీదే ఎల్లప్పుడూ ధ్యాస
ఒళ్ళు భారం , పళ్ళు హీనం, అంతా నొప్పుల మయం
బొక్కలు బలహీనం వీడని నీరసం, వాడని పాయసం
కళ్ళ అద్దాల ఆభరణం , కాళ్ళు జాగ్రత్త , అవయవాలు జాగ్రత్త
అంతా జాగ్రత్త , జాగ్రత్త అంటున్న హెచ్చరికల సహాయం
ప్రతి గాయం పర్యవేక్షణ లేకపోతే కోతి పుండు బ్రహ్మ రాక్షసం
Weight loss కి అవసాన కాలం
Meditation, Yoga చేయి చేయి అనే సలహాల వర్షం
వాటికి చేయూత నివ్వడం కష్టం
తీపి రక్తం కదా అందుకే నిను చుట్టుముట్టే ఈగలు
కుట్టే దోమలు , ప్రాకే చీమలు అన్నీ ఎక్కువే
వేసే చెణుకుల తాళం
నాదం రసహీనం
ఖేధ౦ తప్పని శరణం
దైవ స్మరణం
ప్రతీదీ మన్నికైన ఎన్నికే
నాన్ డయాబిటిక్ లేబులే
ఖరీదూ ఎక్కువే
Hypoglycemia, Hyperglycemia ల మధ్య సమతుల్యం
Sugar Reading ఎక్కువైతే బెదుర్స్
తక్కువైతే వణుకు అదుర్స్
గడియారం గంట కొట్టినట్లు daily timetable పరమావధి
నిరంతర సమయాపాలనా బడి
ఎన్నాళ్ళిలా? ఇంకొన్నాళ్ళు, కొన్నేళ్ళు
సాగిద్దా౦ బ్రతుకు బండి
బాద్యతల బరువులు దించాక
క్రమశిక్షణ అలవడాక
బ్రతుకు జీవుడా అని విశ్రమిద్దా౦
ఏ Organ implant, Hospitalization లేకుండా
శరీర ధర్మాలని నిర్వహిద్దా౦ఈ లోకం నుండి సమయమాసన్న మైనప్పుడు
హాయిగా నిష్క్రమిద్దా౦
ఇట్లు
మధుమేహ పీడితుల
Autobiography
Good Post... Prafulla
రిప్లయితొలగించండి