31, డిసెంబర్ 2012, సోమవారం


శుభాకాంక్షలు  

మనిషి మనిషికి మధ్య రంగు, రూపు, గుణం, నైజం, మించిన మరో తేడా కులం 

ఆ వేర్పాటు సోపానాల రీతి , మనిషి విద్య ,సంస్కారం, పదవిని దాటి మనసుకి మనసుకి మధ్య 

పెదవి దాటి రాని భావవైకల్యమై కుసంస్కారమై, విద్యా సహజ సారం నిరుపయోగమై 

బీడై పోయిన సమాజం గౌరవ ప్రతిష్టలు కేవలం కులంలో కుచించుకుపోయిన వాస్తవం 

 ఛిత్కారాలతో  రాపిడికి రాటుదేలిన కొండశిలలలా  మూర్తిభవించిన సహనశీలులై 

నూన్యతను భరిస్తూ  ఆధిక్యతను సహిస్తూ వెటకారాలని వింటూ 

దొర రాజుల కోపాలకి తాపాలకి బలి అవుతూ ఉన్నత వర్గాలమని బెదిరించే సమూహాల వెలికి గురిఅవుతూ 

ఎన్నాళ్ళు ఈ   పరావర్త ప్రవర్తనం  సమసమాజ ముసుగు మరుగున కనిపించీ  కనిపించని వికృత నర్తనం 

కుల ధనం దాంపత్య జీవన ఆధారం, ప్రేమ దంపతుల మధ్య మటుమాయం 

కేవలం నిలిచేది సమాజం అంగీకరించే సహజాతం, ఆఖరికి మిగిలేది జంతు నైజం, అరణ్య జీవనం 

మనది మానుష జాతి కాదు, ప్రతి కులం ఓ జాతి, సింహాలు కుoదేళ్ళ తో కూడునా ?

ఇది కుల కుసంస్కార వాదనం 

ఒకే  రకమైన ఎన్నెన్నో సమ్మిళిత  అంశాలు 

సంపర్కం నుంచి నవమాసాల దాక, పెంపకం నుంచి మేధాశక్తి  దాక విజ్ఞానం నుంచి సృజనాత్మకత దాక 

టెస్ట్ ట్యూబ్  బేబి నుంచి సర్రోగేట్ మథర్  దాకా 

           ఇంతటి సారూప్యం , సామీప్యo మరి ప్రతి మనిషిలో, మనిషి మనిషి లో అంతో ఇంతో ఎందుకో 

భగవత్ సృష్టి కేవలం మనుష్య జాతి పరం,  మరి నర దృష్టి మానవనైజాన్ని దాటి 

కులాన్ని జాతిగా ఆవిష్కరించిన వైనం, మానవత్వం దేవుని వరం 

కులం మానవుని మతిభ్రమణం 

దైవం అన్ని మరపించి కేవలం కులం మాత్రమే ఒదిలి,  మిగితావన్నీతిరిగి అందిస్తే 

మనిషి జీవితం మహొన్నతం, మహదానందం, మనోజ్ఞం, వివాహ బంధాలు మధురాతి మధురం 

మనసు కేవలం మనసునే వెతుకుతుంది, తుమ్మెద  పూల మధువునే గ్రోలుతుంది 

మనిషి మాత్రం అవసరమైనవన్ని   వదిలి 

 కేవలం కులం మైకంలో మానవఅస్థిత్వాన్ని మరచిపోతున్నాడు 

 మరో కులపు మనిషిలోని దేవుని తూలనాడుతున్నాడు  

   
Cross breed , tissue culture అంటూ విజ్ఞానం చెట్లను  పండ్లను వ్యాపిస్తుంటే ప్రకృతిని శాసిస్తుంటే 

మనుషులు మాత్రం ఇంకా కులం కట్టుబాట్లతో సర్దుకుపోతున్నారు 

మనిషికి మనసే ముఖ్యమైతే కులం మనసు పరిధిలోకి రాదనే సత్యం సంఘం గుర్తించిన నాడు  

నూతన ఆరంభం,  సమసమాజం, సమన్యాయం, ప్రేమైక జీవనం, విశాల దృక్పథం,  నూతన సంవత్సరం 

సుభాభినందనం మరియు ఈడేరు యువత మనోరథం 

                     













29, డిసెంబర్ 2012, శనివారం

భావోద్రేకవాహిని




ఎందులకు నాకు ఈ భావోద్రేకం 

కారుణ్యాన్ని మూటగట్టుకోవడానికి  మాత్రం 

ససేమిరా కాదు 



నాలో ఉప్పొంగుతున్న స్వేచ్చాతరంగిణి 

నా ఉనికిని  పఠిష్ట పరుస్తూ 





ఎడారిలో ఓయాసిస్సులా పరివర్తన చెంది

 నిరాశా నిస్పృహలతో అలసి సొలసే నాలో స్త్రీత్వానికి  

నూతన శక్తిని ప్రసాదించేoదుకే 



నలుదిశలా క్రమ్ముకున్న  మూర్ఖత్వం , మూడ్డాచారం , డాంభికం  

గట్టులను త్రెంచుకుని పురుషాధికార కట్టుబాట్లను చేధిస్తూ

చెలియలి కట్ట దాటిన కడలిలా ప్రవహించేoదుకే, 



సమభావం , సహజీవనం స్థాపించేoదుకే 

నా ఈ భావోద్రేకప్రవాహం   చైతన్య రథప్రయాణం 

 నిరంతర పోరాటo  విప్లవజీవనయానం



    
"What we want to change we curse and then


pick up a tool. Bless whatever you can

with eyes and hands and tongue.


If you can't bless it, get ready to make it new."

~ M. Piercy ~


సమానధర్మం సమభావం 



8, అక్టోబర్ 2012, సోమవారం

అమ్మ మనసు - అత్త ఆశ






అపురూపంగా పెంచుకుంటున్న ఆడపిల్ల 

ఈడ పిల్ల కాదు ఆడ పిల్ల అనే తలపు రాగానే 

అమ్మమనసు అత్త ఆశ అవుతుందేమో 

నా బిడ్డను ఏలుకునేవాడు  ఏ రాముడో  రాకుమారుడో 

అనుకుంటుందేమో 


అమ్మాయి తొలి వలపు కలలు, కథలు మామూలే 

కాని "అత్తకు అల్లుడి ఆశ"  తరతరాల నైజం మార్పే లేని వైనం 

ఎలా ఉంటాడో ఏమో నా అల్లుడు 

 నా చిట్టితల్లికి తగినంత ఎత్తు, రంగు ,  రూపం , గుణం,

 చక్కటి చిరునవ్వు అలవనంత అల్లరి, అలవికానంత తెలివి, అరుదైన అందం  

 కలబోసిన వసంతం మా గుణాభిరామం,  మేధోధీరం, తనయ హృది దీపం
  


ఏo  చదువుతున్నాడో , ఎట్లా చదువుతాడో,

తల్లికి  గారాల పట్టి, తండ్రికి కంటివెలుగు,

ఆ కోసరొoకాయ ఏమౌతాడో ,

డాక్టరో , ఇంజనీరో , నాగలి పట్టే రైతో , ప్రజానాయకుడో , ఇంకేటో  




నా బిడ్డ చెంతుంటే ఇద్దరినీ కన్నులారా ముచ్చటగా చూసుకోవాలని 

జంట పక్షులలాగా కిల కిల , జంట స్వరాలలాగా గల గల మంటుంటే 

చూసి తరించాలనే ఆశ    అందుకే  

"అత్తకు అల్లుడి ఆశ" ఎంతటి నిజం

   

బిడ్డ కన్నా అల్లుడి మీద మమకారం ఎక్కువట 

పుట్టింటిని మరిపించే మర్యాదలు , పండగలు 

తన బిడ్డను అంతకన్నా ప్రేమగా చూసుకోవడానికి లంచాలు 

transferenceకి చక్కటి ఉదాహరణo  


కొడుకే లేని తల్లికి మరి అల్లుడే కదా 

తలకొరివి పెట్టే కొడుకు 

తన ప్రాణసమాన కొమరికను, పెంచిన ప్రేమను, కడుపు తీపిని 

అన్నింటినీ కన్యాదానoతోబాటు కాళ్ళు కడిగి మరీ అందించే ఋణం


బూడిదలో పోసిన పన్నీరు కాకూడదని 

ఏదో తెలియని insecurity  వెంటాడుతుంటే 

ఏ మొగబిడ్డలో ఏ చెడు చూసినా  

అమ్మో నా అల్లుడిలా ఉండకూడదనుకుంటూ  

ఏ మొగబిడ్డలో మంచితనం చూసినా 

నా   కొమరికకు జోడైన వాడు ఇలా ఉంటే అని 

చిగురించే ఆశ సహజమే కదా 

ఎన్నో ప్రయాశలకోడ్చి, ఎన్నో మొక్కులు మ్రొక్కితే కానీ 

తీరని ఆశ,  "అత్తకు అల్లుడి ఆశ"


  బిడ్డకు నేర్పే సంస్కారం , సంప్రదాయం అన్నీ

 "అత్తింటికి వెళ్ళితే"  తో మొదలైయే శిక్షణ 

  అంతా పుట్టింటి  గౌరవం, అమ్మాయి కాపురం మరుగున 

  అల్లుడి కోసమే కదూ అందుకే అత్తకు అల్లుడి ఆశ 


  మరి అంతటి అత్తగారి ప్రేమకు , ఆశలకు ఎదిగి ,

  యోగ్యత సంతరించుకోవడమే కదా

  అల్లుడి అర్హత 

  జీవితాన మరో తల్లిని పొందిన అదృష్టం వల్ల 

  కలిగే బాధ్యత  

 అంతటి పవిత్ర సుందర గౌరవప్రదమైన  స్థానాన్ని కట్నాల దాహంతో , 

 అహంకారంతో త్రోసి పుచ్చి పీడించే దశమ గ్రహమైయే 

 నేటి, అలనాటి, అల్లుళ్ళ చరితం బహు శోచనీయo

పరమ కిరాతకం     
 

                 



5, అక్టోబర్ 2012, శుక్రవారం

Balamaa ? Balaheenatha ?

అబద్దాన్ని  ఎంత అందంగా మలిచినా అది నిజమై పోదుగా

నిజాన్ని ఎంత వొద్దన్నా మనస్సు ఒప్పుకోదుగా

బుద్ది ఎంత కాదన్నా మమత మాసిపోదుగా

శిశిరం వలదన్నా తుత్తునీయలుగా  తలపు తేనెటీగలు

వలపు వసంతాలని ముసురుకోక మానవుగా

ప్రస్థుతం కాలదన్నినా  గత జ్ఞాపకాలు వీడిపోవుగా

ప్రయత్నం అయితే చేస్తాం కాని ఫలితం మన చేతిలో ఉండదుగా

ఎంతటి రారాజులకైనా విధి వారి కనుసన్నలలో మెదలదుగా

దైవ బలం ముందు మానవ ప్రయత్నం దిగదుడుపే కదా

అందుకే దైవాన్ని ఆశ్రయిస్థాo మన ప్రయత్నాలకి బలాన్ని చేకుర్చుకుంటాo  

12, సెప్టెంబర్ 2012, బుధవారం

వ్యవస్థ - వ్యక్తిత్వం

                                                        
సంపాదనే పరమావధిగా నెంచే మరమనుషుల మధ్య 

తృప్తికి చరమ గీతం పాడే  మనసుల మధ్య 

శారీరిక సౌందర్యాన్ని , కాసులను కొలిచే మానవత్వం మధ్య 

విధ్యుక్త ధర్మము  పై రాబడికై  వెంపర్లాడే సమాజం నడుమ 

నీతి నియమాలకి కట్టుబడి ఉండాల్సిన ఆచరణ మార్గము 

ఆర్ధిక సూత్రాలకి తలవంచే మానవ నైజం నడుమ 

నిస్వార్ధాన్ని ఆశించే సామాన్య మానవ ధర్మాన్ని కూడా 

ఆదర్శంగా పేర్కొని అవహేళన చేసే సంకుచిత మనస్థత్వాల మధ్య 

చేతకానితనానికి  practicality గా నామకరణం చేసే పలాయనవాదుల మధ్య 

కట్నంతో ముడిపెట్టి ప్రేమను డబ్బుతో పెరికివేసే వివాహ వ్యవస్థ మధ్య 

స్త్రీ పురుష  సున్నిత  సంబంధాలను లైంగికానందానికి సోపానమని 

భావించే పురుషాహంకారం  మధ్య  ఎవరికోసం 

ఈ అవిరామ ఆలాపన ఎందుకు నిరంతర పెనుగులాట 

నిర్లభ్యమైన తోడుకోసం  వెతుకులాట వ్యర్ధమైయే కాలాయాపన 

26, జులై 2012, గురువారం

LOVE STYLES





 ప్రేమ  ఒక చదరంగం                                            


 భావోద్రేకాల పావులతో చెలగాటం 


మనసుల క్రీడారంగం 








అబద్ధం ఆయుధం నమ్మించి మోసగించడం గమ్యం 


మనిషిని కీలుబోమ్మని చేసి ఆడించడం 


మనసుని గెలిచి మనిషిని స్వాధీనపరచుకుని 


బలహీనతలపై వేటువేసి ఆనందించే నైజం 


LUDUS లవ్ దాని నామధేయం







ప్రేమ  దయతో సమానం


 కరుణ భరితం 


దయార్ద హృదయాలకే సాధ్యం 


నిస్వార్థ చరితం 


తల్లి తండ్రులoదించే తరహా ప్రేమ


శ్రేయోభిలాషుల ప్రేమ 


నిరంతరం కేర్ తీసుకునే వారే నీ శ్రేయస్సు కాంక్షించేవారే 


నిర్మల ప్రేమ  AGAPE  దాని నామధేయం.






ప్రేమ ఒక మైకం 


నిలువునా ముంచివేసే వరద తరంగం 


జీవితాన్ని తల్లకిందులుగా మార్చివేసే 




వాయు ప్రభంజనం 


ప్రేమ అత్యావశ్యకం ఉధృత ప్రవర్తనం 


మతిహీనం గరిపి  మొదటి చూపుతో


 దిల్ ఘాయల్ కర్దేనేవాలి   ప్రేమ 


 మధురానుభూతిలో మునకలు వేసే ప్రేమ  


హద్దులు చేరిపివేసే ప్రేమ 


జీవిత కాలమంతా వ్యర్థం చేసే ప్రేమ 


లుడుస్  ప్రేమకు బలి అయ్యే అవకాశo ఉన్న ప్రేమ    


MANIA  దాని  నామధేయం 





ప్రేమ క్రమానుగతం , నిదానం 


దిన దిన ప్రవర్ధమానం 


నిరంతర గమనం 


ఒకరినొకరు తెలుసుకొనుట , పూర్తిగా అర్థం చేసుకొనుట ముఖ్యం 


స్నేహంతో సమానం , అందుకే స్నేహితులే 


క్రమక్రమంగా ప్రేమికులైయే అవకాశo 


 STORGE  దాని నామధేయం 






ప్రేమకు ఆలోచనే అవశ్యం , ఉద్రేకం అనర్హం 


ప్రేమ నిర్హేతుకం , లావాదేవీలు , ఇచ్చిపుచ్చుకోవడాలు 


లాభనష్టాల బేరీజులతో లెక్కింపు ,  ప్రాక్టికల్ approachకి మాత్రమే జై కొట్టు 


reason, common sense లకి  పెద్దపీట వేయు 


సహచరి ఎంపిక ఎన్నో  గొప్ప నిర్ణయాలలో మరొక సాదా సీదా నిర్ణయం 


అంతే అటు తరువాత పరిణయం వారి ప్రారబ్ధం 


 జీవితం గాలికొదిలేసి జీతం వెంట పరుగుపందెం  


PRAGMA   దాని నామధేయం   






ఆదర్శవంతమైన ప్రేమ 


రాధా కృష్ణుల అనురాగ సంకేతం 




భావోద్వేగం , శృంగారం కలిసిన  ప్రేమ 


సాగర సంగమానికి ప్రతీక  ఈ  ప్రేమ 


ఆత్మల సంగమానికి నిలయం ఈ ప్రేమ 


ప్రేమ వెల్లువ , ప్రణయ కలాపం 


భాoదవ్యారంభంలో  ఉద్వేగం మిళితమైన ప్రేమ 


నిరంతర శారీరిక మానసిక సాన్నిహిత్యం ఆకాoక్షించే ప్రేమ 


EROS దాని నామధేయం 


                                  
                                   ఇవే పరి పరి విధాల ప్రేమ 


                                  మన్నికైన ఎన్నిక మీ ఇష్టం 


                     మోసపోతే నష్టం, విరిగితే హృది అతకడం మహా కష్టం  


                            ఫెవికాల్ జోడీ అయితే మరీ మంచిది నేస్తం           


                      

22, జులై 2012, ఆదివారం

RAAGA BANDHAM



తొలిపొద్దు ముద్దుతో మొదలెట్టి ప్రొద్దంతా సంతోషపెట్టి 


సంధ్యవేళ సాంతం సాయం దిగులoదించకు 


రాత్రి నా నయన మేఘవర్షంలో నిద్రపుచ్చకు


ఎటూ తేల్చని అర్థంకాని  అనుక్షణం మారిపోయే 


నీ అనూహ్య  ప్రవర్తనతో  నన్ను తికమక పెట్టకు 


ఆకర్షించకు ఆనందించకు  అవహేళన చేయకు 


                                        ప్రతి అనుభూతిని పూర్తిగా ఆస్వాదించలేని వెలితిని మిగల్చకు 




                  ప్రపంచంతో పోరాడిన భాధాతప్త హృదయం నీకు  చేరువ కావాలని తపిస్తే 


నీ నిరాదరణతో  నిశిలోకి  గెంటకు  నిదుర వేసారిన కనులకు కన్నీటి ఆలంబనే మిగల్చకు 


                                  నిరంతర ప్రయత్నం నిరాశతో నింపకు   






నీతో ఎన్నో పంచుకుని ఆనందించాలనే ఆకాంక్షను 


నీరు గార్చి నీ నిర్లక్ష వైఖరితో వెనుదిరగకు


నీ చూపుకై వెంపర్లాడే  నా అస్థిత్వానికి 


నీ రాకకై ఆతురతో ఎదురుచూసే నా మానసానికి


కేవలం నిస్పృహ మిగల్చకు 


 నిను నాకు పూర్తిగా దూరం చేయకు 


నీవెవరో తెలియని అగంతకునిగా మారకు 


నా మనోనిగ్రహాన్ని దిగాజార్చకు 




ఎంతో ఆర్తితో నీవు కోరుకున్న సాన్నిహిత్యం నే అందిస్తే సంఘర్షణకు లోను కాకు 


నైతికత , సమాజం పేరుతో నను నిలదీయకు 


ఘర్షనతో నను త్రోసి పుచ్చకు ఒంటరి నీడలలో నా కోసం ఎదురు చూడకు 


బెదిరింపులతో , ఆంక్షలతో , మాటలతో , చేతలతో నన్ను హింసించకు 


నీ సమక్షంలో నిర్విరామ భీతితో తల్లడిల్లే  నా అమాయకత్వాన్ని బలిచేయకు 


                           నన్ను విద్రోహిగా మార్చకు 
                                                                                   
              నీ                           


  నీడలో ప్రేమాదరణ


 పరోక్షoలో  నీ ధ్యాస


  చూపుతో సాంత్వన  


కలయికలో తాదాప్యం



 

అందరికంటే నిన్ను ఓ  మెట్టు పైనుంచే  ప్రాముఖ్యo  


    నీపై ఎన్నటికి వమ్ము కాని నమ్మకం  


           నా మానసానికి అందించు 


ఆత్మస్థైర్యంతో జీవిత ఎడారిని  దాటివేయగలిగే సాహచర్యం


               నీవై , నన్ను గెలుచుకో రాగ బంధమా 



Insecure attachment patterns can compromise
 exploration and the achievement of self-confidence.


 A securely attached baby is free to concentrate
 on her or his environment.


 



ATTACHMENT


                         ATTACHMENT STYLES


19, జులై 2012, గురువారం

kakshaa kaarpanyam

         

             కక్ష లో తిరుగుతుoదనుకున్న జీవితo


               సాఫీగా    సాగుతుoదనుకుంటే                                                                                                                

            ఒక చర్య ఒక పలుకు       


         జీవితాన్ని  ప్రక్క త్రోవ పట్టిస్తుంది


       మాట పట్టింపు, అభిజాత్యం 


                                                   కక్ష సాధింపు, నేరారోపణం , 








      మధ్యలో ఉన్నది పసిహృదయమైనా                                                    


    వసి వాడుతుందనే  ఆలోచనే లేకుండా                                      




ప్రతీకారేచ్చ  హద్దులు   దాటుతుంటే 


ఆధిక్యత పొందిన అహం దెబ్బ తిన్న వేళ 


అంత:పరిశీలనం  , న్యాయాన్యాయాలు                                                                                                        


సమంజస అసమంజసాలు                                                                                                                              


అన్నీ గోదారే,  రాదారిలో వెళ్ళే వన్నీ 


త్రొక్కేది అడ్డదారే 




కంప్లైంట్స్ , explanations,  కేసుల పర్వంలో 


దయా, క్షమా మన పదకోశంలోంచి  మరుగైపోతున్న వేళ 


అంతా అన్యాయం , అరణ్య న్యాయo  


భయం రాజ్యమేలడం ,


అవసరం అణగదొక్కడం 


స్వార్థం చెలామణి  అవడం 





టెర్ర్ రిస్టలది  ఒకే గమ్యం 


శా రీరికంగా  చంపడం 


కానీ మనం సత్సంభంధాల మధ్య ఎదగాల్సిన  మనం                                                      


దేశాన్నే ముందుకు నడిపించాల్సిన మనం 




సమాజంలో కురూపులై , క్షుద్ర శక్తులై                                                                                                        


ఒకరినొకరు మాటలతో , దుశ్చర్యలతో  


చిత్రహింసల పాలు  చేసుకొని  క్షణ  క్షణం 


                                        మానసికంగా చంపుకుంటున్న వైనం 


                               నీచాతి నీచం , మన సంస్కారానికీ  , సభ్యతకే   కళంకం 




   EVERY RELATIONSHIP STARTS FROM  FAMILY
AND
SPREADS THROUGH OUT THE WORLD 








Related Posts Plugin for WordPress, Blogger...