ఇన్నాళ్ళు ఏ గమనం లేక నేను
ఈనాడు నా గమ్యం నీవు
నాడు నిలకడ లేని ఆలోచన
నేడు స్థిరత్వంతో నీ యోచన
అలనాడు ఏ జంటను చూచినా పట్టని నాకు
ఈనాడు ఏ యుగ్మమును గనినా తలపుకు వచ్చే నీవు
భంధం బరువనుకునే ఆదర్శం ఆనాడు
అనుభంధమే సర్వస్స్వమనే ధర్మము ఈనాడు
నాడు నాలోని స్వార్థం
నేడు నీ కోసం త్యాగం
హాయిగా గగనాన ఎగిరే స్వతంత్ర పికం మనసానాడు
మదనుడితో చేయి కలిపి పీడించే నీ నామ స్మరణ౦ ఈనాడు
నీవెవరో తెలియని నేను ఆనాడు
మన మధ్య దూరము భారమై ఈనాడు
గంటలు క్షణాలుగా పరుగిడే కాల కురంగం ఆనాడు
నీవు నా చెంత లేనినాడు క్షణాలు యుగాలుగా గడిచే
సమయపు నత్త నడక ఈనాడు
నేనే పూర్ణ బిందువుని అలనాడు
నీ తోనే నా సంపూర్ణత్వం ఈనాడు
ఏ దైతే భ్రా౦తియని తలచితినో ఆనాడు
దానికై కలవరించి తపించితినీనాడు
నాడు తమస్సు చీల్చే కాంతి
నేడు నీకై తపస్సు చేసే దీప్తి
అంబరము వైపే చూడని లోచనాలానాడు
అ౦బరీశుడికై కలలు కనే కళ్ళు ఈనాడు
నాడు గడిచే ఋతువులు గమని౦చని వయస్సు
నేడు శరదృతువు ఆగమనానికై వేచే మనస్సు
నాడు తుళ్ళుతూ పాడే సెలయేరు
సాగరస౦గమం కోసం సాగే జీవన స్రవంతి నేడు
నాడు ఎవ్వరితోటి చెలిమి చేయని నేను
నీ నెయ్యము కోరి వచ్చిన చేలియని నేను
నాకై నేను నిన్న
నేడు నీలో నేను ఉన్నా
ఈనాడు నా గమ్యం నీవు
నాడు నిలకడ లేని ఆలోచన
నేడు స్థిరత్వంతో నీ యోచన
అలనాడు ఏ జంటను చూచినా పట్టని నాకు
ఈనాడు ఏ యుగ్మమును గనినా తలపుకు వచ్చే నీవు
భంధం బరువనుకునే ఆదర్శం ఆనాడు
అనుభంధమే సర్వస్స్వమనే ధర్మము ఈనాడు
నాడు నాలోని స్వార్థం
నేడు నీ కోసం త్యాగం
హాయిగా గగనాన ఎగిరే స్వతంత్ర పికం మనసానాడు
మదనుడితో చేయి కలిపి పీడించే నీ నామ స్మరణ౦ ఈనాడు
నీవెవరో తెలియని నేను ఆనాడు
మన మధ్య దూరము భారమై ఈనాడు
గంటలు క్షణాలుగా పరుగిడే కాల కురంగం ఆనాడు
నీవు నా చెంత లేనినాడు క్షణాలు యుగాలుగా గడిచే
సమయపు నత్త నడక ఈనాడు
నేనే పూర్ణ బిందువుని అలనాడు
నీ తోనే నా సంపూర్ణత్వం ఈనాడు
ఏ దైతే భ్రా౦తియని తలచితినో ఆనాడు
దానికై కలవరించి తపించితినీనాడు
నాడు తమస్సు చీల్చే కాంతి
నేడు నీకై తపస్సు చేసే దీప్తి
అంబరము వైపే చూడని లోచనాలానాడు
అ౦బరీశుడికై కలలు కనే కళ్ళు ఈనాడు
నాడు గడిచే ఋతువులు గమని౦చని వయస్సు
నేడు శరదృతువు ఆగమనానికై వేచే మనస్సు
నాడు తుళ్ళుతూ పాడే సెలయేరు
సాగరస౦గమం కోసం సాగే జీవన స్రవంతి నేడు
నాడు ఎవ్వరితోటి చెలిమి చేయని నేను
నీ నెయ్యము కోరి వచ్చిన చేలియని నేను
నాకై నేను నిన్న
నేడు నీలో నేను ఉన్నా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి