ప్రతి మనిషి జీవితం
ఒకో బిందువు చుట్టూ
కేంద్రీకృతమైన చట్ర౦
వృత్తం చుట్టూ తిరిగే
కంపస్ లా కొనసాగే జీవనం
గుండ్రటి గడియారం ముల్లులా
పరుగిడే యాంత్రిక గమనం
ఓ కేంద్రబిందువు
కేంద్రబిందువు వీడ్కోలుతో
ఆ వృత్త స్వేచ్చ ఆగమనం
కేంద్ర బిందువు మారితే
చట్ర౦ కూడా మారుతుంది
పరిక్రమ మాత్రం కొనసాగుతుంది
జీవన సుదీర్ఘ ప్రయాణంలో
మారే కేంద్ర బిందువులు
వీడే వృత్తాలు
విడివడని కేంద్ర బిందువులు
వీడని వృత్తాలు
ఒకరి కేంద్రబిందువు మరొకరైన
ప్రణయావృత్త౦
శ్వాస నిశ్వాసల ప్రాణవృత్త౦
రక్త సంచలనం ఓ వృత్త౦
సప్త చక్రాల యోగం
శరీరాలయ ధ్వజ స్థంభం
అందు శక్తి చలనం ఓ వృత్త౦
విడివడని కేంద్ర బిందువులు
వీడని వృత్తాలు
ఒకరి కేంద్రబిందువు మరొకరైన
ప్రణయావృత్త౦
శ్వాస నిశ్వాసల ప్రాణవృత్త౦
రక్త సంచలనం ఓ వృత్త౦
సప్త చక్రాల యోగం
శరీరాలయ ధ్వజ స్థంభం
అందు శక్తి చలనం ఓ వృత్త౦
వ్యక్తుల ప్రవర్తనల సమూహాల హారం
భవిష్యత్ సమాలోచనం
జన్మరాశుల వలయం
పరిణామ సిద్దా౦తం
అభివృద్ది వ్యక్తీకరణం
అండా౦డ పిండా౦డం
దశావతారాల వృత్తం
శివశక్తి సమైక్య నిలయం
ప్రకృతి పురుషుల సంగమ ప్రతీకం
రక్షక కవచం శ్రీ చక్రం
కారణం అన్నిఆక్రుతులకు నెలవైన వృత్తం
సృష్టి మొత్తం ఓ గోళాకార వృత్తం
తిరిగే రంగుల రాట్నం
తరిగే జీవన కాలం
కూడికల తీసివేతల తేడా లేని వృత్తం
తాంత్రిక మిధున మైథున వృత్తం
వేదోపనిషథ్ సారం
పూర్ణం నుంచి పూర్ణ౦ తీసినా
మిగిలే సంపూర్ణం
ఎస్టరోజేన్, ప్రోజెస్స్ట్రోన్ హార్మోన్ల కలయికలా
అర్థనారీశ్వర తత్వం
మమేక జీవుల వృత్త సంపూర్ణత్వం
ముదిత మాతృత్వానికి యోగ్యతగా
ప్రతి మాసం ఋతు శ్రావ వృత్త౦
తిరిగే రంగుల రాట్నం
తరిగే జీవన కాలం
పెద్దదో చిన్నదో వృత్తాలలో
ప్రతి మనిషి జీవించాలి
తన ఆఖరి మజిలి చేరాలి
బిందువులో ఐక్యం కావాలి
వృత్త విముక్తిని పొందాలి
హైందవ పునాది సూత్ర౦
ఆ విముక్తిని కూడా భంధంగా మార్చింది
జనన మరణాల వృత్తంలో ఇమిడ్చి౦ది
బాల్యం, యవ్వనం, జరా, మరణాలు
పునరపి జననం , పునరపి మరణం, ఝఠరే శయనం
పరమాత్మ కేంద్రబిందువుగా భగవద్గీత బోధించిన
జనన మరణాల వృత్తం
భవబ౦ధ పాశం
విముక్తి లేని జీవనం
ఆదిశంకర ఉవాచన౦
నిర్మోహత్వే నిర్మలచిత్తం
నివృత్త బ్రహ్మైక్యం
వెరసి జీవన ముక్తిః
కేంద్ర బిందు ఆకర్షణ
వృత్తం మన్నికైన ఎన్నిక
తొలి జ్ఞాపకాలు, ప్రస్థుత పరిస్థితులు
అవకాశాలు , సాంగత్యాల ప్రాభవం
బిందు కేంద్రీకరణ౦
అంతర్గత ఉత్ప్రేరకాలు , బాహ్య శక్తుల పీడనాలు
అచేతనా వ్యవస్థ ప్రేరేపణలు
పూర్వ జన్మ సంస్కారాల
సమయోజనం కేంద్ర బిందు
సమ్మోహనం
జీవిత పరిధిలో వృత్తాలలో వృత్తాలు
గతకాల జ్ఞాపకాల పునరావృత్తాలు
గతకాల జ్ఞాపకాల పునరావృత్తాలు
మధ్యన ఓ సమాజ
వలయం
వలయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి