23, నవంబర్ 2011, బుధవారం

Madhooha

   మనిషికో ఊహ ఆనందం కలిగిస్తుంది  
   వాస్తవం వ్యథ పెడుతుంది   
   ఏది కావాలన్నామనిషి రె౦టి నీ  జంటగానే స్వీకరించాలి  
   వాస్తవములో కేవలం ఆనందం, ఊహలో కేవలం వ్యథ 
   ఆపేక్షించడం వ్యర్థం                                           
   వ్యధని ఉపేక్షించడం అనర్థం 




    వ్యథ మనసుని మనిషిని తొలుస్తుంది   
    వాస్తవం వర్ణింప శక్యం 
    వ్యథ ఎప్పుడూ వర్ణనాతీతం 
    ఊహ నీ కనుగుణంగా జీవితాన్నిమలుస్తుంది  
    వాస్తవం తన  కనుసన్నలలో నిను మేదిలేలా చేస్తుంది  




    అందుకే  అందరికీ  ఊహాలోకం అవసరం  
    అయినా  వాస్తవం  అత్యవసరం 
    అవసరం పరిధి  దాటనంతవరకు            
    మధూహ మనోహారం ,   
    ఎల్లవేలా పరిమితం
    ఈ పారదర్శపు పొర
 గుర్తుంచుకుంటే జీవితం సుగమం            
                     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...