15, నవంబర్ 2011, మంగళవారం

Panjaram

                 
  మనసు మౌనంగా  అంబరాన్ని  తాకుతుంటే    
మస్తిష్కం  దిగంతాలని    దాటుతుంటే  
జన్మ జన్మలను  తాకుతుంటే   
టైం మెషీన్ కి  చేరువ అవుతుంటే 


శరీరం  మాత్రం వృత్తికి  ప్రవృత్తికి        
డబ్బుకి  హోదాకి , సంపాదనకి ఖర్చుకి  
సత్యానికి  అసత్యానికి, మంచికి  చెడుకి  మధ్య 
మాత్రమే అడుగులు వేస్తుంటే  
కాలానికి  దాసులై,      
శరీర పంజరంలో బందీలైన  
జీవులు ద్వందాతీతులు  అవగలరా ?    
         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...