మౌనరాగం
సుదూర తీరాన
సుమధుర స్వరం
వీనుల విందై
అలవోకగా
అలల అలజడై
అరకూర్చిన శ్రావ్య శబ్ధములై
పదరవములై
మృదుల ప్రశ్నావీచికలై
మానస గీతికను అలరించగా
గైకొనుడు
పల్లవించే నిశబ్దనమస్సుమాలు
నయనాలు గాంచని చిత్రం
జ్ఞానే౦ద్రియాలు తెలుపని భావం
హృదయ స్పందనలో దాగిన ఉద్వేగం
ఉవ్వే త్తున ఎగసిన ఆలోచనా తరంగం
చిత్రవీచికలై అంతర్వేదియై అంతరాళంలో
ఒక అంతరంగం నుంచి మరో అంతరంగానికి
పయణి౦చే
సాదృశ్య మాలికలు
మనోఫలకంపై చిత్రించబడ్డ విచిత్ర చిత్రాలు
మదిని డోళికలూగించగా
గైకొనుడు
నయనాలు గాంచని
మనోహర చిత్రార్పణం
TELEPATHY
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి