శిశురూపాలు తొలి వెలుగులలో
మొదటిసారి ఊపిరి నింపుకుని
కెవ్వుమని ఏడ్చిన ప్రాణాలు
బాధ ఇదీ అని విడమరచి చెప్పలేని స్థితిలో
బలిపశువులై సమాజ౦లో దౌర్జన్యాన్ని సహిస్తూ
బంధుత్వాల కిరాతకానికి ,
బంధనాల హి౦సా ప్రవృత్తికి
బంధనాల హి౦సా ప్రవృత్తికి
మౌనంగా సాక్షిభూతులై నిలుస్తున్నారు
బస్తాల బరువులు కాకపోతే పుస్తకాల బరువులు
అనాధలైతే బ్రతుకంతా భారపు పరుగులు
బాల్య హక్కులు అన్నికేవలం మాయామశ్చీ౦ద్రియాలు
ఎన్నో రకాల ప్రమాదాలు పొంచి ఉన్నస౦ఘంలో
బాల్యం కరువై పోతున్న వ్యవస్థలో
మనదంతా సంప్రదాయమే
ముసుగులో వివిధ రకాల అన్యాయమే
ఆశ నిరాశల మధ్య జీవిత ఆటుపోట్లే
అమ్మ కూలికి పోయి నాన్న సారాయికి పోయి
ఇద్దరూ డ్యుటీకి పోయి
ఆట పాటలు మరుగై రక్షణా దక్షణా కరువై
అగమ్యగోచరమైన బ్రతుకునీడ్చే
బాల బాలికలు
సమాజ భవిష్యత్ చిత్రానికి కుంచెలు
ప్రేమ అందరి సొత్తైనా
పెద్దలకన్నా పిన్నలకే
స్వచ్చమైన ప్రేమ ఎక్కువ అవసరం
ఎంతఅందించినా ఎక్కువైనా తక్కువైనా
అస్సలు ప్రేమను అందించకపోయినా
మన కనుసన్నలలో మెసులుతూ
మన ఆజ్ఞలను ఎదిరించకుండా పాటిస్తూ
మననే నమూనాలుగా భావిస్తూ
స్వచ్చంగా స్వచ్చందంగా తమ ప్రేమని
మనకంది౦చే బాల్యం
దైవకృపకు ప్రతిరూపం
దైవకృపకు ప్రతిరూపం
CHILD ABUSE
Prevention, Treatment & Therapy
Prevention, Treatment & Therapy
మన మాటలను నమ్మేస్తూ
రిప్లయితొలగించండిమననే నమూనాలుగా భావిస్తూ..
ముసుగులో వివిధ రకాల అన్యాయమే
నిజమేనండీ.. ఈ జాడ్యాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. చాలా బాగా చెప్పారు.
Explained beautifully mam 👏👌
రిప్లయితొలగించండి