కౌటుంబిక అనివార్య భాగంగా
గర్భోదయ శిశు కమలాలకు రవితేజస్సునై
బాల సుమ దేహాన్ని దిన దిన౦
ప్రవర్ధమానం గావించి
జ్ఞాన బోధనతో బుద్ధిని వికసింపజేసి
నవ సమ సమాజానికి చేయూత నివ్వాల్సిన వేల
ఫలించనున్న కుసుమాన్ని
రంగు కాగితాలకై అమ్ముకునే
మాత్రుమూర్తిని నేను
సాటి స్త్రీని రూపంతో, డబ్బుతో
తూచే స్త్రీ మూర్తిని నేను
అలనాడు ఆశల ఆకసాన విహంగమై ఎగిరిన నేను
నేడు ఆశలు ఆర్ధిక సూత్రానికి
కట్టుబడి ఉండాలని తలచేనేను
అలనాడు తల్లిదండ్రులను అప్పుల పాలు చేసిన నేను
నేడు మరో పుణ్య దంపతులను జలగనై పీడి౦చే నేను
అలనాడు ఆత్మవిభుని కొనుగోలుదారుని నేను
ఆత్మజుని విక్రయించే విక్రేతను నేడు.
Once a VICTIM
Later an OFFENDER
In Our Family system,
Educational system etc.
Later an OFFENDER
In Our Family system,
Educational system etc.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి