27, నవంబర్ 2011, ఆదివారం
24, నవంబర్ 2011, గురువారం
Tribhuvanagiri (BHONGIR fort)
రుద్రమ దేవి విజయ లాస్యం
నల్లకొండకే నల్లకిరీటం
కాకతీయ సామ్రాజ్య విజయ శిఖరం
రాజ్యాలు సమసినా, నిరతం
నిలిచే కోట భువనగిరి
భువననికే ఓ ప్రాచీన శిల్పకళాసిరి
భానుని మయూఖములతో వెండితాపడమై
తడిసి మెరిసే ఆ వెండి శిఖరం
నిగ నిగ లాడే నల్లరాతి సౌందర్యం
నిలిచే కోట భువనగిరి
భువననికే ఓ ప్రాచీన శిల్పకళాసిరి
భానుని మయూఖములతో వెండితాపడమై
తడిసి మెరిసే ఆ వెండి శిఖరం
నిగ నిగ లాడే నల్లరాతి సౌందర్యం
పావనము శౌర్యము మిళితమైన శైవము
అద్వితీయము అనంతము ఈ సౌధము.23, నవంబర్ 2011, బుధవారం
Madhooha
మనిషికో ఊహ ఆనందం కలిగిస్తుంది
వాస్తవం వ్యథ పెడుతుంది
ఏది కావాలన్నామనిషి రె౦టి నీ జంటగానే స్వీకరించాలి
వాస్తవములో కేవలం ఆనందం, ఊహలో కేవలం వ్యథ
ఆపేక్షించడం వ్యర్థం
వ్యథ మనసుని మనిషిని తొలుస్తుంది
వాస్తవం వర్ణింప శక్యం
వ్యథ ఎప్పుడూ వర్ణనాతీతం
ఊహ నీ కనుగుణంగా జీవితాన్నిమలుస్తుంది
వాస్తవం తన కనుసన్నలలో నిను మేదిలేలా చేస్తుంది
అందుకే అందరికీ ఊహాలోకం అవసరం
అయినా వాస్తవం అత్యవసరం
వాస్తవం వ్యథ పెడుతుంది
ఏది కావాలన్నామనిషి రె౦టి నీ జంటగానే స్వీకరించాలి
వాస్తవములో కేవలం ఆనందం, ఊహలో కేవలం వ్యథ
ఆపేక్షించడం వ్యర్థం
వ్యధని ఉపేక్షించడం అనర్థం
వ్యథ మనసుని మనిషిని తొలుస్తుంది
వాస్తవం వర్ణింప శక్యం
వ్యథ ఎప్పుడూ వర్ణనాతీతం
ఊహ నీ కనుగుణంగా జీవితాన్నిమలుస్తుంది
వాస్తవం తన కనుసన్నలలో నిను మేదిలేలా చేస్తుంది
అందుకే అందరికీ ఊహాలోకం అవసరం
అయినా వాస్తవం అత్యవసరం
అవసరం పరిధి దాటనంతవరకు
మధూహ మనోహారం ,
ఎల్లవేళలా పరిమితం
ఈ పారదర్శపు పొర
గుర్తుంచుకుంటే జీవితం సుగమం
ఎల్లవేళలా పరిమితం
ఈ పారదర్శపు పొర
గుర్తుంచుకుంటే జీవితం సుగమం
19, నవంబర్ 2011, శనివారం
15, నవంబర్ 2011, మంగళవారం
Panjaram
మనసు మౌనంగా అంబరాన్ని తాకుతుంటే
మస్తిష్కం దిగంతాలని దాటుతుంటే
జన్మ జన్మలను తాకుతుంటే
టైం మెషీన్ కి చేరువ అవుతుంటే
శరీరం మాత్రం వృత్తికి ప్రవృత్తికి
డబ్బుకి హోదాకి , సంపాదనకి ఖర్చుకి
సత్యానికి అసత్యానికి, మంచికి చెడుకి మధ్య
మాత్రమే అడుగులు వేస్తుంటే
కాలానికి దాసులై,
శరీర పంజరంలో బందీలైన
జీవులు ద్వందాతీతులు అవగలరా ?
12, నవంబర్ 2011, శనివారం
Vivaaha Bhandham lo Sthree
ఇన్నాళ్ళు ఏ గమనం లేక నేను
ఈనాడు నా గమ్యం నీవు
నాడు నిలకడ లేని ఆలోచన
నేడు స్థిరత్వంతో నీ యోచన
అలనాడు ఏ జంటను చూచినా పట్టని నాకు
ఈనాడు ఏ యుగ్మమును గనినా తలపుకు వచ్చే నీవు
భంధం బరువనుకునే ఆదర్శం ఆనాడు
అనుభంధమే సర్వస్స్వమనే ధర్మము ఈనాడు
నాడు నాలోని స్వార్థం
నేడు నీ కోసం త్యాగం
హాయిగా గగనాన ఎగిరే స్వతంత్ర పికం మనసానాడు
మదనుడితో చేయి కలిపి పీడించే నీ నామ స్మరణ౦ ఈనాడు
నీవెవరో తెలియని నేను ఆనాడు
మన మధ్య దూరము భారమై ఈనాడు
గంటలు క్షణాలుగా పరుగిడే కాల కురంగం ఆనాడు
నీవు నా చెంత లేనినాడు క్షణాలు యుగాలుగా గడిచే
సమయపు నత్త నడక ఈనాడు
నేనే పూర్ణ బిందువుని అలనాడు
నీ తోనే నా సంపూర్ణత్వం ఈనాడు
ఏ దైతే భ్రా౦తియని తలచితినో ఆనాడు
దానికై కలవరించి తపించితినీనాడు
నాడు తమస్సు చీల్చే కాంతి
నేడు నీకై తపస్సు చేసే దీప్తి
అంబరము వైపే చూడని లోచనాలానాడు
అ౦బరీశుడికై కలలు కనే కళ్ళు ఈనాడు
నాడు గడిచే ఋతువులు గమని౦చని వయస్సు
నేడు శరదృతువు ఆగమనానికై వేచే మనస్సు
నాడు తుళ్ళుతూ పాడే సెలయేరు
సాగరస౦గమం కోసం సాగే జీవన స్రవంతి నేడు
నాడు ఎవ్వరితోటి చెలిమి చేయని నేను
నీ నెయ్యము కోరి వచ్చిన చేలియని నేను
నాకై నేను నిన్న
నేడు నీలో నేను ఉన్నా
ఈనాడు నా గమ్యం నీవు
నాడు నిలకడ లేని ఆలోచన
నేడు స్థిరత్వంతో నీ యోచన
అలనాడు ఏ జంటను చూచినా పట్టని నాకు
ఈనాడు ఏ యుగ్మమును గనినా తలపుకు వచ్చే నీవు
భంధం బరువనుకునే ఆదర్శం ఆనాడు
అనుభంధమే సర్వస్స్వమనే ధర్మము ఈనాడు
నాడు నాలోని స్వార్థం
నేడు నీ కోసం త్యాగం
హాయిగా గగనాన ఎగిరే స్వతంత్ర పికం మనసానాడు
మదనుడితో చేయి కలిపి పీడించే నీ నామ స్మరణ౦ ఈనాడు
నీవెవరో తెలియని నేను ఆనాడు
మన మధ్య దూరము భారమై ఈనాడు
గంటలు క్షణాలుగా పరుగిడే కాల కురంగం ఆనాడు
నీవు నా చెంత లేనినాడు క్షణాలు యుగాలుగా గడిచే
సమయపు నత్త నడక ఈనాడు
నేనే పూర్ణ బిందువుని అలనాడు
నీ తోనే నా సంపూర్ణత్వం ఈనాడు
ఏ దైతే భ్రా౦తియని తలచితినో ఆనాడు
దానికై కలవరించి తపించితినీనాడు
నాడు తమస్సు చీల్చే కాంతి
నేడు నీకై తపస్సు చేసే దీప్తి
అంబరము వైపే చూడని లోచనాలానాడు
అ౦బరీశుడికై కలలు కనే కళ్ళు ఈనాడు
నాడు గడిచే ఋతువులు గమని౦చని వయస్సు
నేడు శరదృతువు ఆగమనానికై వేచే మనస్సు
నాడు తుళ్ళుతూ పాడే సెలయేరు
సాగరస౦గమం కోసం సాగే జీవన స్రవంతి నేడు
నాడు ఎవ్వరితోటి చెలిమి చేయని నేను
నీ నెయ్యము కోరి వచ్చిన చేలియని నేను
నాకై నేను నిన్న
నేడు నీలో నేను ఉన్నా
11, నవంబర్ 2011, శుక్రవారం
Vidyullathaa Geethikalu ( Individual verses )
కడలి కెరటం కపోతమై
నింగికెగసిన స్వేచ్చాస్వాతంత్రం
సూన్యాకాశ రహస్యాలను
ఛేధి౦చాలనే మనో నిశ్చయం
నింగి చిత్రపటంపై ఎన్ని రంగుల విచిత్రాలో
నేల ముగ్గులలో ఎన్నెన్ని అందాలో
నింగి నేల కలవని సృష్టి విలాసాలు
అయినా అందుతున్న మౌన సందేశాలు
రె౦టినీ కలవకనే కలుపుతున్న
కందర్పుని కడగండ్ల
వారధులు ఇంద్రధనస్సులు
కన్నీటి చిరుచినుకున ప్రతిఫలనం చెందే
చిరునవ్వు మయూఖములు
మానసాన మెరిసే
మృదు మధురోహల దోబూచులు
క్షితి మానసాన చిగురించిన
వలపు వాగు వయ్యారి పరుగులు
ఉప్పెనై సాగు అందెల రవళులు
సంతోష సాగరానికై సాధనా యత్నాలు
అ౦బరా౦బుధిలో మెరిసి విరిసి పిలిచే
విద్యుల్లతా పుష్పమాలికలు
నిజము చెప్పని నింగి నీవై
అసత్యమాడని ఆకసము నీవై
లౌక్యమా ఏమి నీ గమ్యం
ఎటు కేసి నీ జీవిత గమనం
సత్యా సత్యాలు ఒకటైన
విచిత్ర వైనం
మౌనమానస పవన తరంగమై
హృదిని మీటే గతిని శాసించే
అజ్ఞాత ఆలాపనలు
తపించిన తమస్సులై తరించిన తపస్సులై
భువి చేరని దివియై ముంగిట శ్వేత గులాబీలై
ఎన్నో అందాలని ఎన్నెన్నో నవ్వుల నందనవనాలని
మరెన్నో ఆనందాలని ప౦చుతూ
మానసా౦బరాలేన్నిటినో తారా కాంతితో అల౦కరిస్తున్న
ప్రతి హృదికి ఈ గీతాంజలి విద్యుల్లతాంజలి
మేను తాకీ తాకని స్పర్శ
కా౦క్షను తాకుతుంటే
అనంగుని ఆక్రందనలు
వినిపి౦చీ కనిపి౦చని
మాయా భరిత ఎండమావుల అంకుశాలు
ఆర్తిభరిత వ్యథాకళిత ఎడారి పిలుపులు
అంబరాన మేఘమాల అలజడి అలలు
అంబుధిలో ప్రతిబించు మెరుపు తీగలు
ఆకసాన పయనించు మబ్భు తునకలు
భువిని పులకరించు వర్షాక్షితలు
ఆకసాన పయనించు మబ్భుమంచు శిఖరాలు
కడలి ఒడిలో పోదువుకున్న
పచ్చని ప్రాకృతిక ధరణి ద్వీపాలు
నీలి నింగి కొలనులో సుధా౦శుని చిద్విలాసం
నేల నిశీధిలో కుసుమ పరాగం
ఆకసాన అమర్చిన తారా తోరణం
ధాత్రి గర్భాన రత్నరంజిత కోశాగారం
7, నవంబర్ 2011, సోమవారం
Nunuleta Baalyam
శిశురూపాలు తొలి వెలుగులలో
మొదటిసారి ఊపిరి నింపుకుని
కెవ్వుమని ఏడ్చిన ప్రాణాలు
బాధ ఇదీ అని విడమరచి చెప్పలేని స్థితిలో
బలిపశువులై సమాజ౦లో దౌర్జన్యాన్ని సహిస్తూ
బంధుత్వాల కిరాతకానికి ,
బంధనాల హి౦సా ప్రవృత్తికి
బంధనాల హి౦సా ప్రవృత్తికి
మౌనంగా సాక్షిభూతులై నిలుస్తున్నారు
బస్తాల బరువులు కాకపోతే పుస్తకాల బరువులు
అనాధలైతే బ్రతుకంతా భారపు పరుగులు
బాల్య హక్కులు అన్నికేవలం మాయామశ్చీ౦ద్రియాలు
ఎన్నో రకాల ప్రమాదాలు పొంచి ఉన్నస౦ఘంలో
బాల్యం కరువై పోతున్న వ్యవస్థలో
మనదంతా సంప్రదాయమే
ముసుగులో వివిధ రకాల అన్యాయమే
ఆశ నిరాశల మధ్య జీవిత ఆటుపోట్లే
అమ్మ కూలికి పోయి నాన్న సారాయికి పోయి
ఇద్దరూ డ్యుటీకి పోయి
ఆట పాటలు మరుగై రక్షణా దక్షణా కరువై
అగమ్యగోచరమైన బ్రతుకునీడ్చే
బాల బాలికలు
సమాజ భవిష్యత్ చిత్రానికి కుంచెలు
ప్రేమ అందరి సొత్తైనా
పెద్దలకన్నా పిన్నలకే
స్వచ్చమైన ప్రేమ ఎక్కువ అవసరం
ఎంతఅందించినా ఎక్కువైనా తక్కువైనా
అస్సలు ప్రేమను అందించకపోయినా
మన కనుసన్నలలో మెసులుతూ
మన ఆజ్ఞలను ఎదిరించకుండా పాటిస్తూ
మననే నమూనాలుగా భావిస్తూ
స్వచ్చంగా స్వచ్చందంగా తమ ప్రేమని
మనకంది౦చే బాల్యం
దైవకృపకు ప్రతిరూపం
దైవకృపకు ప్రతిరూపం
CHILD ABUSE
Prevention, Treatment & Therapy
Prevention, Treatment & Therapy
6, నవంబర్ 2011, ఆదివారం
Kavithaarthi
ఓ కవిత లోకి ఒదిగిన ప్రేమ
ఆ కవితలోని ఆర్తి లోకి ఒదిగిన ప్రేమ
ఆ కవితలోని సంపూర్ణ దృశ్యానుభవ
బాధని పంచుకోవాలని ఎదిగిన ప్రేమ
ఏళ్ళ తరువాత
ఆ ప్రేమ విరబూసి ఆహ్లాదాన్ని
కాదు కాదు నిరంతర అన్వేషణ మిగిలిస్తే
ఆ కవితాచిత్రార్తి
ఓ భ్రమతప్త మోహమని
నిర్ధారించుకున్ననాడు
ఆ కవితార్తి కేవలం
ఓ కవితా వస్తువుగా
మిగిలిపోతుంది
Fantasy Vs Reality
Fantasy Vs Reality
An Illusion
Albert Einstein Marilyn Monroe Illusion
When you look at this picture close range you see Albert Einstein.Now stand up and take several steps back, roughly 15 feet away,
It will become... Marilyn Monroe.
4, నవంబర్ 2011, శుక్రవారం
Kendra Binduvu
ప్రతి మనిషి జీవితం
ఒకో బిందువు చుట్టూ
కేంద్రీకృతమైన చట్ర౦
వృత్తం చుట్టూ తిరిగే
కంపస్ లా కొనసాగే జీవనం
గుండ్రటి గడియారం ముల్లులా
పరుగిడే యాంత్రిక గమనం
ఓ కేంద్రబిందువు
కేంద్రబిందువు వీడ్కోలుతో
ఆ వృత్త స్వేచ్చ ఆగమనం
కేంద్ర బిందువు మారితే
చట్ర౦ కూడా మారుతుంది
పరిక్రమ మాత్రం కొనసాగుతుంది
జీవన సుదీర్ఘ ప్రయాణంలో
మారే కేంద్ర బిందువులు
వీడే వృత్తాలు
విడివడని కేంద్ర బిందువులు
వీడని వృత్తాలు
ఒకరి కేంద్రబిందువు మరొకరైన
ప్రణయావృత్త౦
శ్వాస నిశ్వాసల ప్రాణవృత్త౦
రక్త సంచలనం ఓ వృత్త౦
సప్త చక్రాల యోగం
శరీరాలయ ధ్వజ స్థంభం
అందు శక్తి చలనం ఓ వృత్త౦
విడివడని కేంద్ర బిందువులు
వీడని వృత్తాలు
ఒకరి కేంద్రబిందువు మరొకరైన
ప్రణయావృత్త౦
శ్వాస నిశ్వాసల ప్రాణవృత్త౦
రక్త సంచలనం ఓ వృత్త౦
సప్త చక్రాల యోగం
శరీరాలయ ధ్వజ స్థంభం
అందు శక్తి చలనం ఓ వృత్త౦
వ్యక్తుల ప్రవర్తనల సమూహాల హారం
భవిష్యత్ సమాలోచనం
జన్మరాశుల వలయం
పరిణామ సిద్దా౦తం
అభివృద్ది వ్యక్తీకరణం
అండా౦డ పిండా౦డం
దశావతారాల వృత్తం
శివశక్తి సమైక్య నిలయం
ప్రకృతి పురుషుల సంగమ ప్రతీకం
రక్షక కవచం శ్రీ చక్రం
కారణం అన్నిఆక్రుతులకు నెలవైన వృత్తం
సృష్టి మొత్తం ఓ గోళాకార వృత్తం
తిరిగే రంగుల రాట్నం
తరిగే జీవన కాలం
కూడికల తీసివేతల తేడా లేని వృత్తం
తాంత్రిక మిధున మైథున వృత్తం
వేదోపనిషథ్ సారం
పూర్ణం నుంచి పూర్ణ౦ తీసినా
మిగిలే సంపూర్ణం
ఎస్టరోజేన్, ప్రోజెస్స్ట్రోన్ హార్మోన్ల కలయికలా
అర్థనారీశ్వర తత్వం
మమేక జీవుల వృత్త సంపూర్ణత్వం
ముదిత మాతృత్వానికి యోగ్యతగా
ప్రతి మాసం ఋతు శ్రావ వృత్త౦
తిరిగే రంగుల రాట్నం
తరిగే జీవన కాలం
పెద్దదో చిన్నదో వృత్తాలలో
ప్రతి మనిషి జీవించాలి
తన ఆఖరి మజిలి చేరాలి
బిందువులో ఐక్యం కావాలి
వృత్త విముక్తిని పొందాలి
హైందవ పునాది సూత్ర౦
ఆ విముక్తిని కూడా భంధంగా మార్చింది
జనన మరణాల వృత్తంలో ఇమిడ్చి౦ది
బాల్యం, యవ్వనం, జరా, మరణాలు
పునరపి జననం , పునరపి మరణం, ఝఠరే శయనం
పరమాత్మ కేంద్రబిందువుగా భగవద్గీత బోధించిన
జనన మరణాల వృత్తం
భవబ౦ధ పాశం
విముక్తి లేని జీవనం
ఆదిశంకర ఉవాచన౦
నిర్మోహత్వే నిర్మలచిత్తం
నివృత్త బ్రహ్మైక్యం
వెరసి జీవన ముక్తిః
కేంద్ర బిందు ఆకర్షణ
వృత్తం మన్నికైన ఎన్నిక
తొలి జ్ఞాపకాలు, ప్రస్థుత పరిస్థితులు
అవకాశాలు , సాంగత్యాల ప్రాభవం
బిందు కేంద్రీకరణ౦
అంతర్గత ఉత్ప్రేరకాలు , బాహ్య శక్తుల పీడనాలు
అచేతనా వ్యవస్థ ప్రేరేపణలు
పూర్వ జన్మ సంస్కారాల
సమయోజనం కేంద్ర బిందు
సమ్మోహనం
జీవిత పరిధిలో వృత్తాలలో వృత్తాలు
గతకాల జ్ఞాపకాల పునరావృత్తాలు
గతకాల జ్ఞాపకాల పునరావృత్తాలు
మధ్యన ఓ సమాజ
వలయం
వలయం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)