ప్రేమ ఒక చదరంగం
భావోద్రేకాల పావులతో చెలగాటం
మనసుల క్రీడారంగం
అబద్ధం ఆయుధం నమ్మించి మోసగించడం గమ్యం
మనిషిని కీలుబోమ్మని చేసి ఆడించడం
మనసుని గెలిచి మనిషిని స్వాధీనపరచుకుని
బలహీనతలపై వేటువేసి ఆనందించే నైజం
LUDUS లవ్ దాని నామధేయం
ప్రేమ దయతో సమానం
కరుణ భరితం
దయార్ద హృదయాలకే సాధ్యం
నిస్వార్థ చరితం
తల్లి తండ్రులoదించే తరహా ప్రేమ
శ్రేయోభిలాషుల ప్రేమ
నిరంతరం కేర్ తీసుకునే వారే నీ శ్రేయస్సు కాంక్షించేవారే
నిర్మల ప్రేమ AGAPE దాని నామధేయం.
ప్రేమ ఒక మైకం
నిలువునా ముంచివేసే వరద తరంగం
జీవితాన్ని తల్లకిందులుగా మార్చివేసే
వాయు ప్రభంజనం
మతిహీనం గరిపి మొదటి చూపుతో
దిల్ ఘాయల్ కర్దేనేవాలి ప్రేమ
మధురానుభూతిలో మునకలు వేసే ప్రేమ
హద్దులు చేరిపివేసే ప్రేమ
జీవిత కాలమంతా వ్యర్థం చేసే ప్రేమ
లుడుస్ ప్రేమకు బలి అయ్యే అవకాశo ఉన్న ప్రేమ
MANIA దాని నామధేయం
ప్రేమ క్రమానుగతం , నిదానం
దిన దిన ప్రవర్ధమానం
నిరంతర గమనం
ఒకరినొకరు తెలుసుకొనుట , పూర్తిగా అర్థం చేసుకొనుట ముఖ్యం
స్నేహంతో సమానం , అందుకే స్నేహితులే
క్రమక్రమంగా ప్రేమికులైయే అవకాశo
STORGE దాని నామధేయం
ప్రేమకు ఆలోచనే అవశ్యం , ఉద్రేకం అనర్హం
ప్రేమ నిర్హేతుకం , లావాదేవీలు , ఇచ్చిపుచ్చుకోవడాలు
లాభనష్టాల బేరీజులతో లెక్కింపు , ప్రాక్టికల్ approachకి మాత్రమే జై కొట్టు
reason, common sense లకి పెద్దపీట వేయు
సహచరి ఎంపిక ఎన్నో గొప్ప నిర్ణయాలలో మరొక సాదా సీదా నిర్ణయం
అంతే అటు తరువాత పరిణయం వారి ప్రారబ్ధం
జీవితం గాలికొదిలేసి జీతం వెంట పరుగుపందెం
PRAGMA దాని నామధేయం
ఆదర్శవంతమైన ప్రేమ
భావోద్వేగం , శృంగారం కలిసిన ప్రేమ
సాగర సంగమానికి ప్రతీక ఈ ప్రేమ
ఆత్మల సంగమానికి నిలయం ఈ ప్రేమ
ప్రేమ వెల్లువ , ప్రణయ కలాపం
భాoదవ్యారంభంలో ఉద్వేగం మిళితమైన ప్రేమ
నిరంతర శారీరిక మానసిక సాన్నిహిత్యం ఆకాoక్షించే ప్రేమ
EROS దాని నామధేయం
ఇవే పరి పరి విధాల ప్రేమ
మన్నికైన ఎన్నిక మీ ఇష్టం
మోసపోతే నష్టం, విరిగితే హృది అతకడం మహా కష్టం
ఫెవికాల్ జోడీ అయితే మరీ మంచిది నేస్తం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి