సంపాదనే పరమావధిగా నెంచే మరమనుషుల మధ్య
తృప్తికి చరమ గీతం పాడే మనసుల మధ్య
శారీరిక సౌందర్యాన్ని , కాసులను కొలిచే మానవత్వం మధ్య
విధ్యుక్త ధర్మము పై రాబడికై వెంపర్లాడే సమాజం నడుమ
నీతి నియమాలకి కట్టుబడి ఉండాల్సిన ఆచరణ మార్గము
ఆర్ధిక సూత్రాలకి తలవంచే మానవ నైజం నడుమ
నిస్వార్ధాన్ని ఆశించే సామాన్య మానవ ధర్మాన్ని కూడా
ఆదర్శంగా పేర్కొని అవహేళన చేసే సంకుచిత మనస్థత్వాల మధ్య
చేతకానితనానికి practicality గా నామకరణం చేసే పలాయనవాదుల మధ్య
కట్నంతో ముడిపెట్టి ప్రేమను డబ్బుతో పెరికివేసే వివాహ వ్యవస్థ మధ్య
స్త్రీ పురుష సున్నిత సంబంధాలను లైంగికానందానికి సోపానమని
భావించే పురుషాహంకారం మధ్య ఎవరికోసం
ఈ అవిరామ ఆలాపన ఎందుకు నిరంతర పెనుగులాట
నిర్లభ్యమైన తోడుకోసం వెతుకులాట వ్యర్ధమైయే కాలాయాపన
excellent!!
రిప్లయితొలగించండి