శుభాకాంక్షలు
మనిషి మనిషికి మధ్య రంగు, రూపు, గుణం, నైజం, మించిన మరో తేడా కులం
ఆ వేర్పాటు సోపానాల రీతి , మనిషి విద్య ,సంస్కారం, పదవిని దాటి మనసుకి మనసుకి మధ్య
పెదవి దాటి రాని భావవైకల్యమై కుసంస్కారమై, విద్యా సహజ సారం నిరుపయోగమై
బీడై పోయిన సమాజం గౌరవ ప్రతిష్టలు కేవలం కులంలో కుచించుకుపోయిన వాస్తవం
ఛిత్కారాలతో రాపిడికి రాటుదేలిన కొండశిలలలా మూర్తిభవించిన సహనశీలులై
నూన్యతను భరిస్తూ ఆధిక్యతను సహిస్తూ వెటకారాలని వింటూ
దొర రాజుల కోపాలకి తాపాలకి బలి అవుతూ ఉన్నత వర్గాలమని బెదిరించే సమూహాల వెలికి గురిఅవుతూ
ఎన్నాళ్ళు ఈ పరావర్త ప్రవర్తనం సమసమాజ ముసుగు మరుగున కనిపించీ కనిపించని వికృత నర్తనం
కుల ధనం దాంపత్య జీవన ఆధారం, ప్రేమ దంపతుల మధ్య మటుమాయం
కేవలం నిలిచేది సమాజం అంగీకరించే సహజాతం, ఆఖరికి మిగిలేది జంతు నైజం, అరణ్య జీవనం
మనది మానుష జాతి కాదు, ప్రతి కులం ఓ జాతి, సింహాలు కుoదేళ్ళ తో కూడునా ?
ఇది కుల కుసంస్కార వాదనం
ఒకే రకమైన ఎన్నెన్నో సమ్మిళిత అంశాలు
సంపర్కం నుంచి నవమాసాల దాక, పెంపకం నుంచి మేధాశక్తి దాక విజ్ఞానం నుంచి సృజనాత్మకత దాక
టెస్ట్ ట్యూబ్ బేబి నుంచి సర్రోగేట్ మథర్ దాకా
ఇంతటి సారూప్యం , సామీప్యo మరి ప్రతి మనిషిలో, మనిషి మనిషి లో అంతో ఇంతో ఎందుకో
భగవత్ సృష్టి కేవలం మనుష్య జాతి పరం, మరి నర దృష్టి మానవనైజాన్ని దాటి
కులాన్ని జాతిగా ఆవిష్కరించిన వైనం, మానవత్వం దేవుని వరం
కులం మానవుని మతిభ్రమణం
దైవం అన్ని మరపించి కేవలం కులం మాత్రమే ఒదిలి, మిగితావన్నీతిరిగి అందిస్తే
మనిషి జీవితం మహొన్నతం, మహదానందం, మనోజ్ఞం, వివాహ బంధాలు మధురాతి మధురం
మనసు కేవలం మనసునే వెతుకుతుంది, తుమ్మెద పూల మధువునే గ్రోలుతుంది
మనిషి మాత్రం అవసరమైనవన్ని వదిలి
కేవలం కులం మైకంలో మానవఅస్థిత్వాన్ని మరచిపోతున్నాడు
మరో కులపు మనిషిలోని దేవుని తూలనాడుతున్నాడు
Cross breed , tissue culture అంటూ విజ్ఞానం చెట్లను పండ్లను వ్యాపిస్తుంటే ప్రకృతిని శాసిస్తుంటే
మనుషులు మాత్రం ఇంకా కులం కట్టుబాట్లతో సర్దుకుపోతున్నారు
మనిషికి మనసే ముఖ్యమైతే కులం మనసు పరిధిలోకి రాదనే సత్యం సంఘం గుర్తించిన నాడు
నూతన ఆరంభం, సమసమాజం, సమన్యాయం, ప్రేమైక జీవనం, విశాల దృక్పథం, నూతన సంవత్సరం
సుభాభినందనం మరియు ఈడేరు యువత మనోరథం
రిప్లయితొలగించండిమీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు.