కక్ష లో తిరుగుతుoదనుకున్న జీవితo
ఒక చర్య ఒక పలుకు
జీవితాన్ని ప్రక్క త్రోవ పట్టిస్తుంది
మాట పట్టింపు, అభిజాత్యం
కక్ష సాధింపు, నేరారోపణం ,
మధ్యలో ఉన్నది పసిహృదయమైనా
వసి వాడుతుందనే ఆలోచనే లేకుండా
ఆధిక్యత పొందిన అహం దెబ్బ తిన్న వేళ
అన్నీ గోదారే, రాదారిలో వెళ్ళే వన్నీ
త్రొక్కేది అడ్డదారే
కంప్లైంట్స్ , explanations, కేసుల పర్వంలో
దయా, క్షమా మన పదకోశంలోంచి మరుగైపోతున్న వేళ
అంతా అన్యాయం , అరణ్య న్యాయo
భయం రాజ్యమేలడం ,
అవసరం అణగదొక్కడం
స్వార్థం చెలామణి అవడం
టెర్ర్ రిస్టలది ఒకే గమ్యం
శా రీరికంగా చంపడం
దేశాన్నే ముందుకు నడిపించాల్సిన మనం
ఒకరినొకరు మాటలతో , దుశ్చర్యలతో
చిత్రహింసల పాలు చేసుకొని క్షణ క్షణం
మానసికంగా చంపుకుంటున్న వైనం
నీచాతి నీచం , మన సంస్కారానికీ , సభ్యతకే కళంకం
EVERY RELATIONSHIP STARTS FROM FAMILY AND SPREADS THROUGH OUT THE WORLD |
చాలా చాలా చక్కగా చెప్పారు.
రిప్లయితొలగించండి