22, జులై 2012, ఆదివారం

RAAGA BANDHAM



తొలిపొద్దు ముద్దుతో మొదలెట్టి ప్రొద్దంతా సంతోషపెట్టి 


సంధ్యవేళ సాంతం సాయం దిగులoదించకు 


రాత్రి నా నయన మేఘవర్షంలో నిద్రపుచ్చకు


ఎటూ తేల్చని అర్థంకాని  అనుక్షణం మారిపోయే 


నీ అనూహ్య  ప్రవర్తనతో  నన్ను తికమక పెట్టకు 


ఆకర్షించకు ఆనందించకు  అవహేళన చేయకు 


                                        ప్రతి అనుభూతిని పూర్తిగా ఆస్వాదించలేని వెలితిని మిగల్చకు 




                  ప్రపంచంతో పోరాడిన భాధాతప్త హృదయం నీకు  చేరువ కావాలని తపిస్తే 


నీ నిరాదరణతో  నిశిలోకి  గెంటకు  నిదుర వేసారిన కనులకు కన్నీటి ఆలంబనే మిగల్చకు 


                                  నిరంతర ప్రయత్నం నిరాశతో నింపకు   






నీతో ఎన్నో పంచుకుని ఆనందించాలనే ఆకాంక్షను 


నీరు గార్చి నీ నిర్లక్ష వైఖరితో వెనుదిరగకు


నీ చూపుకై వెంపర్లాడే  నా అస్థిత్వానికి 


నీ రాకకై ఆతురతో ఎదురుచూసే నా మానసానికి


కేవలం నిస్పృహ మిగల్చకు 


 నిను నాకు పూర్తిగా దూరం చేయకు 


నీవెవరో తెలియని అగంతకునిగా మారకు 


నా మనోనిగ్రహాన్ని దిగాజార్చకు 




ఎంతో ఆర్తితో నీవు కోరుకున్న సాన్నిహిత్యం నే అందిస్తే సంఘర్షణకు లోను కాకు 


నైతికత , సమాజం పేరుతో నను నిలదీయకు 


ఘర్షనతో నను త్రోసి పుచ్చకు ఒంటరి నీడలలో నా కోసం ఎదురు చూడకు 


బెదిరింపులతో , ఆంక్షలతో , మాటలతో , చేతలతో నన్ను హింసించకు 


నీ సమక్షంలో నిర్విరామ భీతితో తల్లడిల్లే  నా అమాయకత్వాన్ని బలిచేయకు 


                           నన్ను విద్రోహిగా మార్చకు 
                                                                                   
              నీ                           


  నీడలో ప్రేమాదరణ


 పరోక్షoలో  నీ ధ్యాస


  చూపుతో సాంత్వన  


కలయికలో తాదాప్యం



 

అందరికంటే నిన్ను ఓ  మెట్టు పైనుంచే  ప్రాముఖ్యo  


    నీపై ఎన్నటికి వమ్ము కాని నమ్మకం  


           నా మానసానికి అందించు 


ఆత్మస్థైర్యంతో జీవిత ఎడారిని  దాటివేయగలిగే సాహచర్యం


               నీవై , నన్ను గెలుచుకో రాగ బంధమా 



Insecure attachment patterns can compromise
 exploration and the achievement of self-confidence.


 A securely attached baby is free to concentrate
 on her or his environment.


 



ATTACHMENT


                         ATTACHMENT STYLES


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...