8, అక్టోబర్ 2012, సోమవారం

అమ్మ మనసు - అత్త ఆశ






అపురూపంగా పెంచుకుంటున్న ఆడపిల్ల 

ఈడ పిల్ల కాదు ఆడ పిల్ల అనే తలపు రాగానే 

అమ్మమనసు అత్త ఆశ అవుతుందేమో 

నా బిడ్డను ఏలుకునేవాడు  ఏ రాముడో  రాకుమారుడో 

అనుకుంటుందేమో 


అమ్మాయి తొలి వలపు కలలు, కథలు మామూలే 

కాని "అత్తకు అల్లుడి ఆశ"  తరతరాల నైజం మార్పే లేని వైనం 

ఎలా ఉంటాడో ఏమో నా అల్లుడు 

 నా చిట్టితల్లికి తగినంత ఎత్తు, రంగు ,  రూపం , గుణం,

 చక్కటి చిరునవ్వు అలవనంత అల్లరి, అలవికానంత తెలివి, అరుదైన అందం  

 కలబోసిన వసంతం మా గుణాభిరామం,  మేధోధీరం, తనయ హృది దీపం
  


ఏo  చదువుతున్నాడో , ఎట్లా చదువుతాడో,

తల్లికి  గారాల పట్టి, తండ్రికి కంటివెలుగు,

ఆ కోసరొoకాయ ఏమౌతాడో ,

డాక్టరో , ఇంజనీరో , నాగలి పట్టే రైతో , ప్రజానాయకుడో , ఇంకేటో  




నా బిడ్డ చెంతుంటే ఇద్దరినీ కన్నులారా ముచ్చటగా చూసుకోవాలని 

జంట పక్షులలాగా కిల కిల , జంట స్వరాలలాగా గల గల మంటుంటే 

చూసి తరించాలనే ఆశ    అందుకే  

"అత్తకు అల్లుడి ఆశ" ఎంతటి నిజం

   

బిడ్డ కన్నా అల్లుడి మీద మమకారం ఎక్కువట 

పుట్టింటిని మరిపించే మర్యాదలు , పండగలు 

తన బిడ్డను అంతకన్నా ప్రేమగా చూసుకోవడానికి లంచాలు 

transferenceకి చక్కటి ఉదాహరణo  


కొడుకే లేని తల్లికి మరి అల్లుడే కదా 

తలకొరివి పెట్టే కొడుకు 

తన ప్రాణసమాన కొమరికను, పెంచిన ప్రేమను, కడుపు తీపిని 

అన్నింటినీ కన్యాదానoతోబాటు కాళ్ళు కడిగి మరీ అందించే ఋణం


బూడిదలో పోసిన పన్నీరు కాకూడదని 

ఏదో తెలియని insecurity  వెంటాడుతుంటే 

ఏ మొగబిడ్డలో ఏ చెడు చూసినా  

అమ్మో నా అల్లుడిలా ఉండకూడదనుకుంటూ  

ఏ మొగబిడ్డలో మంచితనం చూసినా 

నా   కొమరికకు జోడైన వాడు ఇలా ఉంటే అని 

చిగురించే ఆశ సహజమే కదా 

ఎన్నో ప్రయాశలకోడ్చి, ఎన్నో మొక్కులు మ్రొక్కితే కానీ 

తీరని ఆశ,  "అత్తకు అల్లుడి ఆశ"


  బిడ్డకు నేర్పే సంస్కారం , సంప్రదాయం అన్నీ

 "అత్తింటికి వెళ్ళితే"  తో మొదలైయే శిక్షణ 

  అంతా పుట్టింటి  గౌరవం, అమ్మాయి కాపురం మరుగున 

  అల్లుడి కోసమే కదూ అందుకే అత్తకు అల్లుడి ఆశ 


  మరి అంతటి అత్తగారి ప్రేమకు , ఆశలకు ఎదిగి ,

  యోగ్యత సంతరించుకోవడమే కదా

  అల్లుడి అర్హత 

  జీవితాన మరో తల్లిని పొందిన అదృష్టం వల్ల 

  కలిగే బాధ్యత  

 అంతటి పవిత్ర సుందర గౌరవప్రదమైన  స్థానాన్ని కట్నాల దాహంతో , 

 అహంకారంతో త్రోసి పుచ్చి పీడించే దశమ గ్రహమైయే 

 నేటి, అలనాటి, అల్లుళ్ళ చరితం బహు శోచనీయo

పరమ కిరాతకం     
 

                 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...