ఎందులకు నాకు ఈ భావోద్రేకం
కారుణ్యాన్ని మూటగట్టుకోవడానికి మాత్రం
ససేమిరా కాదు
నాలో ఉప్పొంగుతున్న స్వేచ్చాతరంగిణి
నా ఉనికిని పఠిష్ట పరుస్తూ
ఎడారిలో ఓయాసిస్సులా పరివర్తన చెంది
నిరాశా నిస్పృహలతో అలసి సొలసే నాలో స్త్రీత్వానికి
నూతన శక్తిని ప్రసాదించేoదుకే
నలుదిశలా క్రమ్ముకున్న మూర్ఖత్వం , మూడ్డాచారం , డాంభికం
గట్టులను త్రెంచుకుని పురుషాధికార కట్టుబాట్లను చేధిస్తూ
చెలియలి కట్ట దాటిన కడలిలా ప్రవహించేoదుకే,
సమభావం , సహజీవనం స్థాపించేoదుకే
నా ఈ భావోద్రేకప్రవాహం చైతన్య రథప్రయాణం
నిరంతర పోరాటo విప్లవజీవనయానం
"What we want to change we curse and then
pick up a tool. Bless whatever you can
with eyes and hands and tongue.
If you can't bless it, get ready to make it new."
~ M. Piercy ~
with eyes and hands and tongue.
If you can't bless it, get ready to make it new."
~ M. Piercy ~
సమానధర్మం సమభావం |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి