5, జులై 2012, గురువారం

Vidyaarnyam


అదో  మహారణ్యం  university  దాని నామధేయం
అక్కడ తస్మాత్ జాగ్రత్త అనే బోర్డ్ ఉండదు కాని


         దాని నిండా జీవచరాలు నిశాచరాలు మాత్రం కావు
 నిద్రలో కూడా వెంటాడే రాక్షస నైజాలు, వాక్కులు వాడి కత్తులు 
         జీహ్వలు రంగులు మార్చే ఊసరవెల్లులు
వాచస్పతులనే బిరుదాoకితాలు   


కుల మత విద్వేషాలకు అది నిలయం కాని
            దానికి సమసమాజ ఆలయమనే లేపనం
 బలహీనత, experience ప్రవాహం లో  ప్రతిభ అంతా మటుమాయం
  
కలతలే దానికి ఆనవాలం reservation , quota హక్కుల సమరం 


పదవికై , పదోన్నతి కై  పరుగులు 
retirement కి సంవత్సరాలు తరిగి
 వయస్సు పెరిగి  తలలు నెరిసి
 పండిన అహం ఎండిన గళం  
నికృష్టజీవనం  దానికి ఆహార్యం 


 బంద్ లు, భేటిలతో  విద్య విలీనం 
నువ్వెంత అంటే నువ్వెంత అనే విద్యార్థి అధ్యాపక సంబంధం 
ఒకరికి సర్టిఫికేట్ ముఖ్యం ఇంకొకరికి జీతం ముఖ్యం
మధ్యన నాణ్యత అధోగతి అయ్యే వైనం 


ఒకరి జోలికి ఇంకొకరు వెళ్ళని సహవాసం 
నువ్వు చదివావా అంటే తమరు చదువు చెప్పారా అని అడిగే స్వతంత్రం 
అందుకే మార్కుల దానం ఎందుకోచ్చిన  గోల అని మౌనం
మేధావుల అజ్ఞాతవాసం 


ఫోబియా , chaos , indiscipline చవిచూడాలంటే university మెట్లెక్కండి 
అందులో అడుగిడితే అంతా అగమ్యగోచరం, కీకార్ణ్య న్యాయం 
punctuality మరిచే పొవచ్చు ఏం జరిగినా మరమత్తులు  చేయించుకోవచ్చు
అందుకే therapistsకి  అక్కడ భలే గిరాకి తెలుసా మరేనండి
అటుతరువాత అంతా సరేనండి  


 రండి రండహొ రండి 
విధ్యార్థులారా విద్యారణ్యం కనండి
 భలే పసందుగా విద్య  గైకొనండి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...