అమ్మ పరుగెత్తకే అసహ్యంగా అనిపిస్తుంది అన్నప్పుడే అపరాధ భావం కలిగింది
నన్ను బుట్టబొమ్మలా తయారుచేసినప్పుడే అనుమానం వచ్చింది
నాకు వయసోచ్చిందని
అరవయ్యేళ్ళ ఓ తాతయ్య అసభ్యంగా ప్రవర్తిoచిప్పుడే వెగటొచ్చింది
బస్సులో ప్రతి వెధవా కావాలని తాకినప్పుడే అసహ్యం వేసింది
నాకు పెళ్లి చేయాలనే చింత అమ్మని వేదిస్తున్నప్పుడే తెలిసొచ్చింది
ఆ వయసే నాకు శత్రువని
“It is easier to live through someone else than to complete yourself. The freedom to lead and plan your own life is frightening if you have never faced it before. It is frightening when a woman finally realizes that there is no answer to the question 'who am I' except the voice inside herself.”
― Betty Friedan
అమ్మ నన్ను మొగాళ్ళ ముందు పెళ్లిచూపుల పేరుతో
షోకేస్లో బొమ్మలాగా కుర్చోపెట్టినప్పుడే సిగ్గేసింది
చుట్టు పక్కల వాళ్ళు , చుట్టాలు ఇప్పుడే సంబంధాలు చూడండి
లేట్ అయితే కష్టం అన్నప్పుడే అర్ధమైంది
సంతలో అందమైన సరుకులా నా వైవాహిక జీవితానికి
ఈ వయసే పెట్టుబడి అని
“Each suburban wife struggles with it alone. As she made the beds, shopped for groceries, matched slipcover material, ate peanut butter sandwiches with her children, chauffeured Cub Scouts and Brownies, lay beside her husband at night- she was afraid to ask even of herself the silent question-- 'Is this all?”
― Betty Friedan, The Feminine Mystique
కాని నీవు నన్ను కలిసాక నా మనస్సుని మెప్పించాక
నీలో ఇక్యం కావాలనే కోరిక నాలో ఉదయించాక
నాకు స్పురించింది
నా వయస్సు నీ వయస్సుని వలచిందని
ఎలుగెత్తి పిలిచిందని
“A woman knows very well that, though a wit sends her his poems, praises her judgment, solicits her criticism, and drinks her tea, this by no means signifies that he respects her opinions, admires her understanding, or will refuse, though the rapier is denied him, to run through the body with his pen.”
― Virginia Woolf, Orlando
నీకు చెప్పాలనిపించింది
నీ దరికి వచ్చినప్పుడు నేను నా వయస్సునే కాదు
నా అస్థిత్వాన్నే మరచిపోతానని
కాని ఎప్పుడైతే ఆఖరికి అందరిలా
నువ్వు కూడా ఆడవయస్సుని హేళన చేసావో
అప్పుడు అనిపించింది
నలుగురిలో నన్ను అవమానంతో తలవంచుకునేలా చేసింది
నన్ను చులకనపాలు చేసింది
నిన్ను వలచిన నా వయస్సేనని
Women have been taught that, for us, the earth is flat, and that if we venture out, we will fall off the edge. ~Andrea Dworkin
ఓ వయస్సా నీకు
శత కోటి వందనాలు
శత సహస్ర ఛీత్కారాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి