నిశ్శబ్ద తరగతులు
నిశ్శబ్ద తరగతులలో
శబ్దం కోసం
విరహంతో విలపిస్తున్నా !😔
అనాథ ప్రేతాల్లా స్టాఫ్ రూమ్ లో
ముచ్చటగా ముగ్గురం
ముచ్చటైన ముగ్గురం ! 👽👽👽
ముచ్చట్ల మురిపం తీరే లోపే
సమర నాదం యుద్ధ వాదం
విత్తు ముందా చెట్టు ముందా !😌
బొమ్మ వేస్తే బొరుసు
బొరుసు పడితే బొమ్మ
బొమ్మా బొరుసా ఆలోచించే లోపే
కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి !😟
ఏమి చేయాలో తెలియని అయోమయం
సహకరించని సాయుధ గణం !
డిస్కషన్ ఆర్గుమెంట్ అయ్యే లోపే
క్రింద హాల్ లో సెలబ్రేషన్
కర్ణభేరి భరించలేని ఢమరుక నాదం !
అంతలోనే
ఒకరికొకరు ఇచ్చుకునే సాంత్వన
అటుపై నిశ్శబ్ద వీచిక !💔💙
ఆడవారు మాట్లాడుకోనే వద్దు
నెగిటివ్ గా ........ రెడ్డిగారి హెచ్చరిక
పాజిటివ్ గా అత్తగారింటి గురించి
ఏ కోడలైనా మాట్లాడిందా ?
మాట్లాడినా ఆడవారి మాటలకు
అర్థాలే వేరులే
సగం నిండు అంటే సగం ఖాళీనే
పాపం పండిన పండు
పాపం పరేషాన్ !😀😝
ఎవరిని ఎవరు పరిపాలిస్తున్నారు
సైన్న్యాన్ని సామ్రాట్తా ?
సామ్రాట్టుని సైన్యమా ?
లేదా
అందర్నీ అధిరోహించి స్వారీ చేసి,
ఉపాధ్యాయుల్ని తయారుచేసే
కర్మాగారాన్ని, భర్తీ చేసే
సైన్యాధ్యక్షుడా పరిపాలన గావించేది ? 🙆
రోజులెలా గడుస్తున్నాయో
ఆకసాన్ని అడగాలి వంగి నేలను
స్పృశిస్తున్నావేంటి అని
SPIRITUALITY & MATERIALISM
ప్రతీసారి అవి కలిసే చోటు
ఏది నిజమో ఏది మాయో
ఎవరు గురువో ఎవరు శిష్యులో
తెలియని
నాతో నేను, నాలో నేను
నిరంతర ఘర్షణ సంఘర్షణ !😨
హే భగవన్
జిందగీ హర్ కదం ఏక్ నయి జంగ్ హయ్
జీత్ జాయేంగే హాఁ అగర్ తూ సన్గ్ హై
🙏🙏🙏
🙈🙉🙊
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి