22, జులై 2023, శనివారం

????......

 

ఏమి జరిగిందంటే ఏమి చెప్పను !


సుడిగాలి ఉధృతానికి విరిగిన శకలాలని 

నేల కొరిగిన శిధిలాలని నెమ్మనెమ్మదిగా 

ఒక్కొక్కటే ఏర్చి పేర్చుకుంటున్నానని చెప్పనా !


విరిగిన శకలమే కదా అంటావేమో

 అది నా ఆత్మస్థైర్యమని నీకు తెలియదా ?

ఆ శిధిలాలలో నేల కొరిగిన 

నేను అనే నా అస్తిత్వం నీకు కనిపించలేదా ?


నీకు ఎలా తెలుస్తుందిలే ? బలహీనత 

నీ కళ్ళకు గంతలు కట్టింది కదా !

మనసు మరుగున మృదుత్వం  

కారుణ్యరహితంగా  కాఠిన్యాన్ని సంతరించుకుంది కదా !


నేను చేసిన తప్పేంటి ?

 నన్ను నేను 

ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నా 

ఎన్నెన్ని వేళల నిలదీసుకున్నా 

అనంత సూన్యం బావురుమన్నది 


విలువలు అవసరం లేదంటున్న సమాజాన్ని

 ఇవిగివిగో వీటిని పాటించమనడం 

ఎంతటి నిర్హేతుకం !

నిశ్చయమే లేని  గమనానికి 

గమ్యం విడమరచి వివరించడం

 ఎంతటి నిశిద్ధం !


ఓ బాటసారి బాట నీది గమ్యం నీది 

గమనం నీది కానీ స్వప్నం నాది 

అందుకే నా స్వప్న విరచిత 

నవ గీతికలకు ఈ నీ అపస్వరాలు 

అందుకే నా స్వప్న విరచిత 

నవ సాదృశ్యానికి ఈ నల్లటి రంగుల మరకలు 

ఒక జీవితానికి  సరిపోయేటంత కన్నీటి వరదలు 

చివరి వరకు మిగిలిపోయే తుషార చారకలు 


సుడిగాలి వెళ్లిపోయిందని సంతసించనా 

తను పేర్చిన అక్షర నష్టాన్ని నెమరు వేసుకుని 

లెక్కకట్టి పరితపించనా ?

అక్షరాల గాయాలు నిరంతరం బాధిస్తుంటే 

మందే లేని కాలంతో పయనించనా ?


మానని వ్యథ మారని మనిషి 

తీరని దాహం సమాధానమే లేని ప్రశ్న 

నన్ను ఈ నిర్గమనమైన దారిలో  

 అందరికి అగుపించని పూతోటలో 

అంతర్ పయనంలో ఆత్మ శోధనలో 

నిస్సంగత్వం తోడైన శాంతి బాటలో 

నడిపిస్తుందని తెలుపనా !


సమాజ స్రవంతి తీర్చని దాహార్తి 

నాలో అంతర్వేది తీర్చిందని చెప్పనా ?

 


గురుతర బాధ్యత -----బోధకుని నిరంతర వ్యథ 

వికలమైన విద్యా వ్యవస్థ ------పతనమయే విద్యార్ధి దిశ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...