మబ్బు పూలు
ఆకాశం తోటలో మబ్బుపూలు
ఒక్కొక్కటే తెంపుకుని
నా కొంగులో నింపుకుని
రోజూ గుండె గూటిలో
నిన్ను కొలుస్తున్నా దేవరా !
నీ దయతో నిండిన కనుచూపు
కొంగున కట్టుకుని
నా జీవనయానం కొనసాగిస్తున్నా
మాదేవా !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి