భావనలు వర్షిస్తే మనసుల్ని స్పర్శించేమృదువైన కవిత కలం నుంచి జాలువారితేభువి ఆసాంతం జయించినకవి హృదయస్పందనం
కనులను చేరిన క్షణం లోనే
రంగులద్దుకున్న కుంచె
మనోనేత్రసౌధాలలో తివాచీలై పరుచుకున్న
బహు సుందర వర్ణ చిత్రం చిత్రీకరించి
సౌందర్య సామ్రాజ్యానికి కిరీటం లేని
మహా రాజై విరాజిల్లు
చిత్రకారుని నయన లాస్యం
స్వరతరంగాలలో తేలియాడుతూ
నవ నాడులను మీటుతూ
సప్త యోగ చక్రాలను స్పృశిస్తూ
వాగేయ మేరువు ఆశీర్వాదంతో
గురుని ఆధారంతో
సంగీత సాగర మథనం కావించి
కీర్తనల అమృతం చిలికి
శ్రోతల్ని అమరులని మైమరపించే
గాయకుడి తన్మయత్వం
గంధర్వలోకం పై దిగ్విజయం
ప్రాప్తించిన గాన గాంధర్వ సాధనా సప్తమం
రాళ్ళలో రాగాలు పలికించి
రసజ్ఞత పొందుపరిచి
కంటి మెరుపులు వింటి విరుపులు
నున్నదనం లాఘవంగా చెక్కి
ఉలితో వివరాలు విశదీకరించి
శిల్ప కళతో కట్టిపడేసే శిల్పి
కళాత్మక జగ్గత్తుని శ్వాప్ణికమో సత్యమో మనకే మిగిల్చే
తరతరాలుగా నిలిచే సృష్టి
అమోఘ ప్రతిసృష్టిని ప్రతిష్టించే
సుందర స్వరాజ్యాలను
గెలిచిన శిల్పి సజీవ దరహాసం
పరమానందం ఇటువంటి ఎన్నెన్నో అద్భుతమైన
మహా సామ్రాజ్యాలలో
నెలవై ఉంటే పదవులకై వెంపర్లాడుతూ
ధనంతో త్వమేవాహం అంటూ
ఆనందం కోసం కరువ్వాచి
నలుదిశలా పరువులెత్తుతున్న
వింతలోకం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి