పరావర్తనం
గతించిన కాలవాహినిలో జ్ఞప్తికలు దీపికలై
స్వీయ చరిత్ర పై వెలుగులు ప్రసరిస్తుంటే
నిశిలో నీడకై వెతుకులాట
నిరర్ధక నిరపయోజనాలై
నిజం కేవలం నేడే అంటుంటే
ఓ రూపం అజరామరమై
కలకాలం నిలుస్తుందనుకుంటే
చెదరి రూపురేఖలు వేరైన సారూప్యత
కొనసాగింపై
ఆగర్భతిమిరాంధకార గుహలో
వెలుగై దైవమై
వెలసిన ప్రతిబింబము చెరగనీకుమా
కాలగమనమా ! చిత్తచాంచల్యమా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి