నిశీధి
నలువైపులా నిశీధి వీధి వీధి నిశీధి
చీకటి తెమ్మరల ఆవలి అనంత నిశీధి
గుణం రూపం తనలో కలుపుకున్న
నిర్గుణం నిరూపం ఈ నిశీధి
నలుపు తనలో నిలువుకున్న కాలవర్ణం నిశీధి
కారు చీకటి ఈ నిశీధి నిరాకారం ఈ నిశీధి
నిశ్శబ్దం నిస్తేజం నింపుకున్న నిండుదనం నిశీధి
గాఢత అలుముకున్న గాఢాంధకారం ఈ నిశీధి
రంగు రూపు కనుమరుగై ఏ రాత లేని నల్ల పలక నిశీధి
విసిగి వేసారిన వేదన ఈ నిశీధి
నిశీధి పయనం జీవనయానం సరళ రేఖలైన బ్రతుకు చీకటీ నిశీధి
మృత్యువు ముసుగు మరుగున మౌనమీ నిశీధి
ఈ నిశీధి నా చుట్టూ అలుముకున్న వేళ నాలో ఆ నిశీధి
నిర్మల చిత్తం నాదైన నిశీధి
అగోచర అచింత్య అప్రాకృతిక నిశీధి
అస్తిత్వం పొగమంచై
ఆధ్యాత్మిక అక్షరంగా మారిన నిశీధి
సోహం అంటూ వెలుగూ చీకటీ మమేకమైన
ఓంకారం ఆ నిశీధి
నిర్వాణ కాంతి పుంజం
ఉద్భవించే ఆ గర్భసూన్యం
ఆ నిశీధి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి