21, ఏప్రిల్ 2020, మంగళవారం

పునాది రాళ్లు

 నిశీధికి  ఓ చిరుదివ్వె  మౌనవిన్నపం 

నీకు నాకు మధ్య
నీకు నాకు మధ్య మన దేశానికి 
పునాది రాళ్లు 
మనకి అందని తీరాలకి వారిని చేర్చాలనే  ఆరాటం 
ఉవ్వెత్తున లేచే  స్వార్థ  సమాజ కడలి  తరంగం 
పునాది రాళ్లు వారధిగా మారితేనే దేశఉజ్వల భవిత 
అబద్ధం ఆక్రమిస్తే  , శిలాశాసనం మునిగి తేలని నిజం ,
ధర్మం పునాది రాళ్ల శిథిలాల తో జీవశ్చవం 
ముందు తరాల నిశీధి జీవనం  

 నీ చేతిలో రెప రెప లాడే  చదువుల తల్లి  చిరుదివ్వె  
 నీ రక్షణ తో నవ సమాజ నిర్మాణం
 నా జీవన అద్భుత కావ్యం 

నన్ను మార్చాలనో  ఏమార్చాలనో  ప్రయత్నించకు
నేను ఎన్నటికైనా ఎగిరిపోయే పావురాయినే 
నేల మీద నా మనస్సు , నీ భుజం పై వ్రాలినప్పుడు 
నా ప్రేమ , ఆకాశంలో ఎగిరేటప్పుడు నా అంతరాత్మ
ఒకే పావురాయి 

బ్రతకాలనుకునే వారికి మార్పు 
నాలా బ్రతుకునీడ్చే వారికి కాదు 
పది వసంతాలు దూరంలో నా కోసం 
ఎదురుచూస్తున్న నా సాంత్వన ,
 నా బలహీనమైన  శరీరపంజరంలో  బంధీయైన 
నా పావురాయికి స్వేచ్ఛ నిచ్చే ఆ మృత్యుదేవత ఆహ్వానం 
తనలో ఐక్యమే నా తాదాప్యం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...