16, ఆగస్టు 2017, బుధవారం

Parichayam

      పరిచయం 

ఎన్నెనో  సందేహాలకు సమాధానం 
అవుతుందనుకున్న ఆ పరిచయం 
చిత్రంగా సమసిపోయింది 

నేను నావి నా వారు గొప్ప 
అనుకునే అహం తో  
మిళితమై అంతమైంది 

గురువు  దైవం తో  మొదలై 
ఎటో తెలియని ప్రయాణమై 
గమ్యం చేరకనే అలసిపోయింది 

ఆధ్యాత్మిక  సారంతో 
ఒప్పందమై ఒద్దికగా  పంచుకుంటున్న 
అనుభవాల ఏకాంతం 
అసంకల్పితంగా ఆగిపోయింది 

అయినా ఓ అందమైన జ్ఞాపకమై
 పరిమళిస్తూనే ఉంది 
పూర్తిగా తెలియని ఓ అస్థిత్వాన్ని 
నాకు చేరువగా నిలిపి 
దూరంతో నవ్వుతుంది 
అజ్ఞానంతో అల్లుకుంది
కమ్మని కలలా 
కనురెప్పల మాటున 
అజ్ఞాతంలోకి జారుకుంది  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...