బాంధవ్యం
ప్రవాసాంధ్రులు అమెరికా వాస్తవ్యులు
వాళ్ళతో బాటు వచ్చే
అమెరికన్ చాకోలెట్స్ హ్యాండ్ బాగ్స్ రిస్ట్ వాచెస్
Reagan నుంచి Trump దాకా ఇంకా అదే ట్రెండ్
గిఫ్ట్ కల్చర్
American Accent లో మాట్లాడితే
అర్థమై అర్థమవక వాళ్ళు రావడమే గొప్పనుకుని
ఆ చిన్న చిన్న గిఫ్ట్స్ కే తెగ మురిసి
అతిధి మర్యాదలు చేసే ఇక్కడి మూర్ఖ శిఖామణులు
మాతృభాష మాతృప్రేమ మాతృదేశం వొదిలేసిన వాళ్ళే
role models అయినారు నేటి యువతకి
తేడా ఏంటి అక్కడికి ఇక్కడికి
comfortable life , affluence, systematic living
తేడా ఏంటి అప్పటికి ఇప్పటికి
దాస్యం మరో దేశ ప్రజలకి
అప్పుడు Britishers ఇప్పుడు Americans
మనతో ఆడుకున్న వాడు మాయమైపోయాడు
మాకు టైం లేదక్కా మర్మగర్బంగా
చెప్పకనే చెబుతున్నారు
రావడం పోడం ఖర్చు టైం వేస్ట్
బాంధవ్యాన్నీ బాల్యాన్ని తాచులో తూచి
మరిదేన్నో ఎన్నుకున్న అప్రాచ్యులు
ఒకప్పటి తిట్టు ఇప్పుడో పూలహారం
It seems from a center point
we have traveled away
all cousins
in different directions
to unknown zones
gradually becoming
from close relatives to strangers
we bother least about each other
in this rat race
కానీ మీ వృద్దాప్యంలో వెలితి
కుమ్మరి పురుగులా
మీ మదిని తొలుస్తుంటే
చిన్నతనమంతా మీకు గుర్తొస్తుంటే
చేసిన పనులు చిన్నతనంగా అనిపిస్తుంటే
బేరీజు వేసుకున్న తీరే తప్పని పిస్తుంటే
అప్పుడు ఏం చేస్తారు ?
అస్సలు పిల్లలే కనిపించని వీధి చూస్తుంటే
వృద్దాప్య మిథునం జంటలు మాత్రమే అగుపిస్తుంటే
ఒకప్పుడు పచ్చగా పిల్లలతో కళకళ లాడిన వీధి
ఇప్పుడు బంగళాలతో నిండి
జీవం లేని శిధిల నిశ్శబ్ద వీధి యై వెక్కిరిస్తుంటే
భారతావని యువతే లేని భవిష్యత్తు
ఇదేనా అని ప్రశ్నిస్తుంటే
భవిష్యత్తు గమనించే తీరిక లేని దేశం
అయోమయంలో కాలంతో బాటు పరుగెడుతోంది
కానీ నాణానికి మరో వైపు ఉంటుందని నమ్మే వాళ్ళం
134 కోట్ల జనాభా లోంచి ఎన్ని వేల మంది
వలస వెళ్లినా భయమే లేదు
అన్నీ మీరొదిలి వెళ్లారు
మీరెప్పుడు వచ్చినా ఆప్యాయత వడ్డిస్తాము
మీది స్వార్థం కాదు success అని మీరనుకుంటున్నారు
పాపం మాయ లేడి వెంట పరువులెత్తుతున్నారు
అని మేమనుకుంటున్నాము
అగుపించని మీ కష్టం
కనిపించే మీ సంపద కనిపెంచిన మా ప్రేమ
అన్నీ క్షణభంగురమే
కలకాలం నిలిచే వారెవరూ లేరు
అమెరికా లో ఉంటే ఈ గోలలు గొడవలు ఉండవు పిన్ని
హాయిగా ఉంటుంది వాడి స్వేచ్చా ఆనందాన్ని వెళ్లబోసుకున్నాడు
ఏదో disadvantages లో advantages ని వెలికి తీసి వాపోతున్న
మా బావగారి అమెరికా అబ్బాయి
అవునులే computer కి బానిసలైన మీకు
సంబంధ బాంధవ్యాలు గొడవలతో గోలలో పడి
రాటుదేలుతాయని బలపడతాయని
ఎలా తెలుస్తుంది !
పోట్లాడుకున్నా మాట్లాడకున్నా మాది రక్త సంబంధం
అది వివరిస్తే అర్థం కాని mechanical బుర్రలు మీవి
mechanized ప్రపంచం మీది
అందరూ relatives కాదు
దగ్గరి తనం లో కూడా చుట్టాలు
బంధువులు రక్తసంబంధీకులు
అని relationships ని కూడా
systematize చేసింది కదా
మన ఆంధ్ర సంస్కృతి
అక్కడ అంతా ఒక్కటే అందరూ అంతే
only self and others మాత్రమే
అబ్బా ఈ dirty Indian roads
అని వాడంటుంటే
వీటిమీదే కదరా నీవు పడి
దొరలి పొరలి మరీ ఆడింది
ఆ మాటనడానికి నోరెలా వచ్చిందిరా ?
తిట్టే కాఠిన్యం మాకు లేదు
చాన్నాళ్ళకి వాడిని చూసిన మృదుత్వం తో !
అదే నోరు తల్లిని తిట్టక మానుతుందా
ఏదో నాడు ఏవగించుకోక పోతుందా ?
ఈ మధ్య వాళ్ళ వెలితికి
ఓ కొత్త మందు కనుక్కున్నారు
spirituality దాని నామ ధేయం
అదేంటో మనమెరుగం
సర్వసంగ పరిత్యాగం
ఆహా కాదు
భారత సహవాస త్యాగం ?
అమెరికా నివాస యోగ్యం ?
power money status పూజితం ?
భారత నిరుపేదలకు అనర్హం ?
ఏమో !!
कहाँ हो क्या फरक पड़ता
कितनी मन की शाँति कमाते हो वो बोल !
सब कुछ छोड़ छाड़ के गए हो तो
values किसे सिखा रहे हो
और क्या सिखा रहे हो अपने बच्चों को
जो माँ को , मातृभाषा को और मातृभूमि को
ठुकराए उसके बातों को कैसे मान दे
जाके क्या कर रहे हो वहां पर
temples जाना पूजा पाठ करना
festivals मनाना culture का एहसास
तो बहुत हो रहा है तुम्हे ,
वो भी किसे दिखाने के लिए ?
विदेशियों या स्वदेशियों की वाह वाही के लिए ?
पाप को पुण्य में बदलने के लिए ?
फिर भी शाभाष बेटा !
भारतीय संस्कृति को विदोशों को
परिचय करवाने के लिए
కానీ మేము చెప్పేదీ కాస్త వినండి
ప్రతి మజిలీ దగ్గర కాస్త ఆగండి
వెనుతిరిగి చూడండి
గతాన్ని నెమరు వేసుకోండి
మీ భవిష్యత్తు కోసం
తమ భవిష్యత్తు ని పనంగా పెట్టిన
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా ఫర్వాలేదు
మట్టిలోకలిసి పోయే వాళ్ళం
కానీ తరతరాలని దాటి నిలిచిపోయే
నేల తల్లి మనది సుధాసంస్కృతి ఇది
మీ తరువది తరాల వారసత్వ హక్కు అది
పరదేశ పౌరసత్వంతో మలినం చేయకండి
దయచేసి భరతావనిని అలక్ష్యం కానీయకండి
మీ కోసం నా ఈ ప్రార్థనా కుసుమం అందుకోండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి