20, జూన్ 2017, మంగళవారం

Paatha Madhuraalu

నాన్న 
చరిత్ర పరిశోధించి ప్రతి ఆలయ గాథ 
చెపుతూ ఉంటే నిద్రలోకి జారుకున్న రోజులు 

పురాణాలు ఇతిహాసాలు వివరిస్తుంటే 
విలువలు నేర్చుకున్న రోజులు 

 బౌద్ధ ఆరామాలు వెలికి తీసిన పురావస్థు శాఖాధికారిగా 
శోధించిన వాస్తవాలు వివరిస్తుంటే 
బుద్ధుని ధ్యాన ముద్రలో నిమగ్నమైన రోజులు 

పద్యాలు శ్లోకాలు రాగ యుక్తంగా పాడుతుంటే
 మైమరచి విన్న రోజులు 

అమ్మ ఆకాశంలో అందని తార అయినా 
ధైర్యంతో మమ్మల్ని ముందుకు నడిపించిన రోజులు 

ఆ రోజులన్నీ గతించి కేవలం నాన్న మాత్రం మిగిలారు 
అన్నీ మర్చిపోతూ అందర్నీ తలుచుకుంటూ గతం నెమరు వేసుకుంటూ 
అలసిన జీవన ప్రయాణమైన నాన్నని చూస్తుంటే అనిపిస్తుంటుంది 

ఒక్కసారి టైం మెషిన్ నాకు అవకాశమే ఇస్తే 
మళ్ళీ ఆ పాత రోజులు ఆ పాత మధురాలు వెతికి మరీ తెచ్చేసుకుంటాను 
నా  పాత నాన్నని  నే  చేరుకుంటాను 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...