Mano Ganga
2, డిసెంబర్ 2011, శుక్రవారం
MANASA GANGA
బ్రహ్మ కమండలంలో నిండిన వేళ దివ్య గంగ
దివి నుండి భువికి దిగి అమరనాధుని సిగలోభంధింపబడ్డ వేళ
శివగంగ
దేవలోకాలలో విహరించే వేళ ఆకాశ గంగ
పరవళ్ళు త్రొక్కుతూ అర్థనారీశ్వరుని బాహువుల్లో
ఎగసి ఒదిగిన వేళ భవానీ గంగ
మృత్యువుని అమరత్వం వైపు నడిపించు
అమరగంగ
స్వచ్చమైన శ్వేత జలధారలు ధరణిని సశ్యామలం చేయ అన్నపూర్ణ గంగ
హిమశిఖరాన మేఘధారలు కురువగా కరిగి
ప్రవహించిన
ఆర్ద్ర గంగ
బాధాతప్త హృదిలో ఉప్పొంగిననాడు భావగంగ
తమస్వినీ కుహరాల పతితుల పావన మొనర్చ
పుణీత గంగ
కవిత్వమై మనస్సులను అలరించిననాడు మనోగంగ
శరత్జ్యోత్స్నాలలో కడలిరాపట్టిని తన జలస్రవంతిలో ప్రసరించిననాడు
మనోజ్ఞ గంగ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి