పసితనపు అమ్మ నాన్న ఆట గుర్తుతెచ్చింది
నేను శివుడంటే నేను పార్వతిని అనే పెంకితనం
గడుసుదనం, అల్లరి చిలిపితనం
ఎన్నో ఏళ్ళ పరిచయం ఉన్నట్లు
అన్నీ మరచిన ఆ నమ్మకం
చిత్ర విచిత్రం
మదిలో దిగ్బంధన చేసినా పొగమంచై
సుతిమెత్తగా స్పర్శించి మది నిండా
అలుముకున్న రూపం
ఆ హృద్య భావన పదాల కూర్చితే
పాపమనే అపరాధ భావం
భవ భయ కారణం
ఒక్కొక్క క్షణం ఎవరెవరెక్కడ అని ఆచి తూచి
పరిస్థితి నెమరువేసుకుని వ్యథతో
వెనుకంజ వేసిన వైనం
మరలిన కాలగమనం గతానికై
వెతుకులాటకా !
మలి సంధ్య జీవనానికి
ప్రస్థుత సుందర స్వప్న
చేయూతకా !
ఒక కన్నీటి చుక్క నిరీక్షణ
ఒక వేగవంతమైన హృదయ స్పందన
రాలిపోయే పువ్వా
నీకు తొలి పొద్దు రాగాలెందుకే
అని ప్రశ్నిస్తుంటే !
మలి పొద్దు రంగులు కరిగి చెరిగి పోనీయకే
అని బుద్ధులు నేర్పుతుంటే !
కొన్ని పారేసుకుని కొన్ని వొదిలేసుకుని
జ్యోతిని నేనైనా వెలుతురికై అన్వేషించే సమిధనై
ఈ నిరంతర పయనం
అరమరికలు లేని స్నేహమై నిలిచి
platonic ప్రేమగా ఒదిగి
లింగ బంధాన్ని సుందరంగా
మలుచుకోగలిగే సంబంధం
స్త్రీ పురుష అనుబంధం
అణువుల ఆకర్షణ ఎక్కువైతే
అతి చేరువైతే Annihilation ప్రమాదం
అస్థిత్వానికై పోట్లాట అనివార్యం
వికర్షణ వేర్పాటు సహజo
Ionic , Covalent or Coordinate bonding
- ఏదో రకమైన bondage అయితే
Emancipation ఎలా సాధ్యం
No commitment వల్ల సుసాధ్యం
అనితర సాధ్యం ఏముంది భువిలో
ఐనా ప్రకృతి సిద్ధమైన స్వభావానికి
మనస్సు ఎందుకు వ్యతిరేకం
Commitment మానసిక సౌందర్యం
కానీ ఒకరికి సౌకర్యం మరొకరికి అసౌకర్యం
మొత్తానికి, ముదిరితే రోగం
philosophers & psychologists కి
కానీ కాస్త లోతుగా ధ్యానిస్తే వేరే కారణం
దైవాన్ని పొందటానికైనా కావాల్సిందే
ఈ వీడని వ్యామోహం
గులాబీ పెదవులను తాకి
తొలి మంచు చిరునవ్వులో కరిగి
కిరణాల నులివెచ్చని చూపులలో ఒదిగి
ఆకాశ వదనంలో
చిదంబర రహస్యాలెన్నో కోరి
మబ్బుబుగ్గ సొట్టలో తేలియాడి
అందాలన్నీ ఆస్వాదించాలనే ఆర్తి
ఆ దివ్యానుభూతి పతి, ప్రకృతి ,
శ్రీశైల శ్రీశివుని చిత్తరువు
తోడ తాదాప్య విలీనం
పరవశ అద్వైతం
ఉట్టి అందనిది ఆకాశమందునా !
శివశక్త్యానుభూతి,
ధనఋణ ఐక్యతకు ప్రతీకమైన
స్త్రీ పురుషుల ప్రేమ యందు పొందనిది
శ్రీ చక్ర బిందు సంగమం మందు అందునా !
దైవస్వరూపం దొరకునా !
కామం మొహం ప్రేమ
అన్నీసమన్వయ పరచి
ఓ మానవ స్వరూపానికొసగినా
అదే వ్యక్త ద్వైతం , అవ్యక్త అద్వైతం
దైవమందు ఐక్యమైనా అదే అద్వైతం
అమలిన శృంగారం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి