తమస్వినీ తాదాప్యం
నింగి నిశ్శబ్దంగా నేలను ముద్దిడితే
అవని విరబూసిన విరుల విలాసాలతో
ఆకాశాన్ని కలవరిస్తున్న ఓ నాటి నిశీధి
నిశ్శబ్ద బంజరు భూములలో పరువులెత్తే పిల్లగాలికి
ఊగిసలాడే ఆకుల సన్నటి అలికిడితో
మిణుగురుల మెల్లని గాత్రాలతో
సొంపుగా వంగిన పొదల మెత్తని ఊసులతో
నక్షత్రాలు నిండిన వినీల నిశి లో
దిగంతాలకు వ్యాపించే ఓ అంతరంగం
అందాలు వెలిగే తెల్లని పావురాయై
రెక్కలు విశాలంగా విప్పుకుని గగనానికి ఎగరసాగింది
జ్యోతిర్మయమైన ఆ బృందావన బృహత్ జ్యోత్స్నలకి
గవాక్షాలే అక్షువులై సాక్షులై సంకెళ్ళై చుట్టుముట్టిన
సమున్నత భవన సముదాయాన్ని
దాటి పై పైకి ఎగసిపోసాగింది
దేదీప్యమానమై దహిస్తున్న వ్యవస్థ వసారాలలో విహరించడం మాని
మాయావరణపు పొరలను కరిగించుకుంటూ
చిక్కటి చీకటులను చేధించుకుంటూ
ఆకశంలోకి పయణించసాగింది
అంతలోనే ఎందుకో మరి
విసిగివేశారో , మరో ప్రపంచం తలుపులు తెరవనందుకో,
విద్యుల్లతా ఘాతానికో, ఆకర్షక దిగ్బంధనానికో
ఘాఢతను సంతరించుకుని ఎవరికోసమో మరి
దిగి భువిపైని గురుదత్తుని పాదాలపై వాలింది
రుణవిమోచనమెప్పుడో నని ఎదురుచూస్తుంది.
An Ecstasy Experience
of
Soul travelling
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి