22, జూన్ 2012, శుక్రవారం

NENU

గోళాలని నడుపుతున్న కక్ష్య రేఖలా 


సరళరేఖలని కలుపుతున్న ఇన్విసిబల్ ఇంక్ గీతలా 


మేధస్సులను కలగలుపుతున్న క్వాంటం కాంతి రేఖలా 


మనస్సులని ఏకం చేస్తున్న మౌన గీతంలా 


తలరాతలని మమేకం చేస్తున్న నుదిటి గీతలా 


జీవనోదయస్సoధ్యలను లయింప చేస్తున్న జన్మ పునర్జన్మ  వృత్తరేఖలా 


ఆత్మలని  సమైక్యం  చేస్తున్న భగవద్గీతలా


 మజిలీల నడుమ  అగుపించని  అస్థిత్వం 


ద్వందాల మధ్య కనిపించే వ్యక్తిత్వం 


కనిపించీ మురిపిoచీ కనుమరుగైయే  మిధ్యా ప్రపంచ మనస్థత్వం   


ఎక్కడ  జీవన స్థిరత్వం ?  ఎందులో  జీవితానందం ? 


తెలియని  నేను  ,  మోత్తంగా  నేను ,

నాలో నేను, ఎవరికీ అర్ధం కాని నేను 


నను నడిపించే  హస్తంకోసం వెతుకులాడే  నేను ,


దరికి  రాని  తీరాల చేరువ కోసం ఆర్తిగా ఎదురుచూసే  నేను 


నాకే  తెలియని నేను - అంటున్న నేను ,  మరి ఎవరా నేను? 


అచేతన దాని పేరట , ఫ్రాయిడ్ దానికి తండ్రట.    







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...