ఓ కన్నీటి బిందు రూపమా, చెక్కిలిపై నువ్వు జారుతుంటే
నా నయనాలు ఎరుపెక్కుతున్నాయి ఎందుకు?
నువ్వు వాటిని విడిచి దిగంతాలకు పరుగు తీస్తున్నావనా ?
ఆర్ద్రతతో నిన్ను తిరిగి రమ్మని పిలిచినా
అధోపాతాళానికి జారి నువ్వు
నీ అస్థిత్వాన్నే నాశనం చేసుకున్నావు
మల్లీ నన్ను చేరే అర్హత నీకెక్కడిదని వాపోతున్నావా
నా తప్త హృదయ ప్రతిబి౦బమా ?
అస్సలు నా కంటినుండి వీడిపోయావెందుకే కన్నీటి కెరటమా ?
నాతో విధి చేలగాటమాడి నన్ను అమ్మ అనే పిలుపుకి దూరం చేసిందని
జాలితో ఓదార్చాలని నీ ఉనికినే మాపుకుంటున్నావా
ఓ అమాయక బిందురూపమా ?
నా జీవితాన నా తల్లి తో సహా అందరు నన్ను మోసగించారని
నన్ను ఒంటరిగా ఒదలి వేసారని తోడుగా ఉంటానని
నా చెక్కిలిని స్ప్రు శిస్తున్నావా ఓ మూగ నేస్తమా?
వ్యర్ధంగా ఇంకెన్నాళ్ళు బ్రతుకునీడుస్తావని
అనంత విశ్వంలో నా ఉనికీ
ఓ అసాశ్వతమైన బిందువేనని
అందులకే నన్ను శతకోటి కోటి బిందువులను వీడి ఒంటరిగా బ్రతుకు పోరాటం సాగించి
నీలాగే నా అస్థిత్వాన్ని వీడమని సందేశానిస్తున్నావా ఓ నా కన్నీటి బంధు రూపమా?
మనసoటూ లేని నేను
కేవలం నీటి రూపమైనా , అంతర్వాహినినైనా
నేను అనంతవాహినినై ఉప్పెనలా ఉప్పొంగి
నీ చెక్కిలి మైదానం పై నిరంతరంగా కాకపోయినా
నీలో బాధ మెదిలితే చాలు మురిపెంగా ప్రవహిస్తాను
నీలో భాగంగా నీతో కలకాలం మిగిలి ఉంటాను
మరి మనసున్న మనుషులకంటే
నేనే ఎంతో మేలు కదా అని న్యాయ నిర్ణయం కోరుతున్నావా
నా నయన మేఘ వర్షమా ?
ఓ అనాథ
కే రా ఫ్ అనాథ శరణాలయం
ORPHAN AND DESTITUTE THERAPY