మీసం లేని బ్రతుకే నీరసం
మీసం మగటిమి అందం
మెలితిప్పే మీసమే రాజసం
ముసలి మీసం కుర్ర మీసం నూనూగు మీసం
వయస్సు తెలిపే బహువిధం
మీసంతో పురుష పుంగవ దరహాసం
గాంభీర్య రాజస బంధనం
మీసం కోసమే ఈ ప్రాస బహుమానం
మీసం లేని కుర్ర కుంక పిల్లాడే
మీసం ఉన్న కుర్రోడు మొగాడే
పురుషోత్తముడే 💎
పురుష మంత్రo పౌరుష మంత్రం
మీసం భజంతి పురుషం
మీసం ! పురుషం తవ శరణం
కావున ఓ పురుషా మీసం విలువ తెలుసుకుని
మీసమును ప్రేమించుమన్నా
మొలకెత్త మీసమును గొరగకన్నా
మొక్కలతో బాటు మీసమును పెంచుమన్నా
ఏలనగా
మీసమున్న వాడేను మొనగాడేనోయ్ !!