హే కృష్ణా
నువ్వు ప్రక్కనుంటే ప్రకృతి అందమంతా అలంకరించుకున్నట్లు
నువ్వు ఎదురుగా ఉంటే గుర్తింపు అలలా అలరిస్తున్నట్లు
నీ కనుదోయి నా మదిలోకి తొంగి చూస్తే సమ్మోహనం
నన్ను నలుదిశలా క్రమ్మేసినట్లు
నీ మాటలతో వాస్థవానికి దూరంగా
వయస్సు గతంలోకి పయనించి
పరువంలో మరువంలా గుభాలిస్తున్నట్లు
నీ నవ్వులో నా స్వేచ్ఛ నింపాదిగా
రెక్కలు విప్పుకున్నట్లు
నా వైపు సాగే నీ అడుగులు నన్ను నిలువునా అల్లుకున్నట్లు
నీ అస్థిత్వం నన్ను మబ్బులా అలుముకున్నట్లు
నీ ప్రతీ రాక నన్ను వాన వెల్లువై తడిపేస్తుంది
ఆనందం వెన్నెలై నా హృదిని పరుచుకుంటుంది
నా తనువును సహజాతం మృదువుగా స్పృశిస్తుంది
కాల వలయం నా జీవితంతో రాజీపడి
సమయాన్ని పట్టి కట్టి నిలిపేస్తుంది
స్నిగ్ధ మందహాస డోళికలలో ఓలలాడిస్తుంది