పారదర్సకత ( Transparency )
కొన్ని విసిరే సవాళ్ళు
పురుష పుంగవులకి స్త్రీల ఆనవాళ్ళు
సహృదయంతో స్పందిస్తే అరవిరిసే అందాలు
సమాన ధర్మంతో తిలకిస్తే న్యాయ విన్యాస లాస్యాలు
విశాల దృక్పథంతో ఆస్వాదిస్తే ఆనంద మకరందాలు
మరి తమరు సగుణ స్వరూప వైవిధ్య అవసరాలను గుర్తించగలరా ?
మేము జీవన వికృతికి వయో రుతువర్ణాల అందాలు అద్దగలము
తమరు జీవన ప్రాకృతిక సౌందర్యానికి సహజత్వాన్ని ఆపాదించగలరా ?మేము నిజం నింపాదిగా దర్శించి సున్నితంగా వాస్తవపు వాకిళ్ళు
అలికి ముగ్గు సిగ్గు లయలలో జాలువారే జీవన తరంగంలా ఒద్దికగా ఒదగగలము
తమరు అధరాల జారే నిజాల పలుకుల కిరణాలతో వాస్తవాల వెలుగు లోగిళ్ళై జీవించగలరా ?
మేము జీతభత్యం లేని జీవన స్రవంతిలో మమేకమవగలము
తమరు జీతమే లేని సేవని కనీసం డిగ్నిటి అఫ్ లేబర్ గా స్వీకరించగలరా ?
అన్నీ అంగట్లో దొరుకుతున్న సూపర్ మార్కెట్ ప్రపంచంలో యూజ్ ఎండ్ త్రో వ్యాపార ధోరణిలో విద్య నుండి వివాహం దాకా, జననం నుంచి మరణం దాకా రాషన్ కార్డ్ నుంచి గ్రీన్ కార్డ్ దాకా, ప్రతీదీ కమర్షియలైజ్ అవుతున్న ధనాకర్శణలో
మా అస్థిత్వాన్ని మా వ్యక్తిత్వంతో గెలుచుకోగలము
తమరు ఈ అస్థిత్వ రణరంగంలో మా వ్యక్తిత్వనిర్మాణానికి సహకరించగలరా ?
మాయా మర్మం లేని అమాయకత్వపు ఆస్థులతో మోసం ద్వేషం లేని మనసులతో కల్మషం లేని జీవన యానం సాగించగలము
మా ఆదర్శపు ప్లేటోనిక్ లోకంపై అకృత్యం అత్యాచారం, మూఢాచారం, ఆధిపత్యం, దోపిడీతత్వం కారుమేఘాలై క్రమ్ముకుంటే గాలితెమ్మరలై పోరాడే మాతో కలిసి మీలో కిరాతకులని పాలద్రోలగలరా ?
HAPPY WOMENS DAY