27, సెప్టెంబర్ 2015, ఆదివారం

MAYA

                                                                           మా య
  


నీకు నాకు మధ్య 
పలచని పారదర్శపు పొర  
గతంలో  ఎందరి మధ్యో అది పోలుసై అలుసై 
రాలిపోతే

మన మధ్య అది తెరై నీ ముసుగై 
లక్ష్మణ రేఖై వెక్కిరిస్తుంది 

ఆ తెర తీయగా రాదా  నీ ముసుగు వీడగరాదా ?


ఎవరికి ఎవరినైనా ఏ చింతా లేదు నాకు 
కాని నీ చింతనలో నేనెవరినో,
 అందరిలో ఒకరినో  అవడం 
అనిశ్చింత నాలో

నాలో నువ్వు ఎవరివో తెలియని నీవు 
పదిలంగా నిన్ను పొదువుకున్న  నేను
గడియ గడియకి నిను తడుముకున్న నేను 
  
నీ రాగం గానం మాట మౌనం వినే నేను 
నా ప్రాణం నా జీవం నా జీవితం అన్నీ నీవు  


నీ ఉత్పత్తి లో భాగమై  తృప్తికి కారణమై నందుకు కాదు 
కేవలం నీకు ఓ  ఒప్పందం కావడం
 అంతకు మించి ఏమి కాదన్న భావనం
 భాధాతీతం

అందరిపై చేసే ప్రయోగం నాపై ప్రయోగిస్తున్నారంటే 
నన్ను సహాయ పరికరంగా చూడనా 
మామూలైన దేవుని  అలవాటును
 నాకు కొత్తేమీ కాదనే విధి ధీమాను వీక్షించనా  

నన్ను కేవలం ప్రత్యుత్పతి  సాధనకు మరో మెట్టుగా గాంచనా 

నను తాకిన నీ స్పర్శ మానసికమైనదైనా 
                 అందరిని ఇదే విధాన ఆనందింప చేసిందని 
చేస్తున్నదని సంతసించనా 

 శా స్త్రీ య చికిత్సలు  అందరికి సుపరిచితమేనని 
 ఉదాహరణలలో గమనించి
     గత సాఫల్యాలను అనుమానించి  
          భీతినొన్దనా   

గతం ఎవరిదీ కాదు కాని
 నీ ప్రస్తుతం , భవిషత్తు 
 నాది కావాలనే ఆరాటం 
నిన్నటి నా రోదనైంది 

నీ గతంలో వ్యక్తులలాగే నేనూ కేవలం
 నీ కొక ఉదాహరణగా మాత్రమే  మిగిలిపోతానేమో అని 
చిన్నతనమనిపించింది 
నిన్ను వీడిపోతానేమోననే భయమేసింది 
దూరమవడానికే ఈ  ప్రయత్నమంతా అనిపించి భాధేసింది 

     



        
Related Posts Plugin for WordPress, Blogger...