14, ఏప్రిల్ 2012, శనివారం

Achetanaajeevitham

    చిన్నప్పటి  చందమామ కథలు
    రాజులు, రాజకుమారులు, రారాణులు, 
    యువరాణులు, ఎంతైనా  ఆఖరికి గెలిచే ప్రేమ 
    వింత వింత లోకాల సరికొత్త వింత కథనాలు
    అన్ని ఎక్కడికి పోయాయి? 
    ఎక్కడికీ పోలేదు అచేతనలో  నిక్షిప్తమైపోయాయి  


    ఎవరి  హెచ్చరికలు లెక్క చేయని దైర్యం 
 దొంగతనంగా అందింది అందిపుచ్చుకునే నైజం
నిర్లక్ష్యంతో ముందుకు ఉరికే సాహసాల సాంగత్యం  
శ్రమను ఈసడించి సౌఖ్యాన్ని ఆలింగనం చేసుకునే బద్ధకం     
చిన్నికృష్ణుని చిలిపి చేష్టలకు ప్రతీకం 
                    ఇడ్         




 దేవుడికి  దణ్ణం ఉండ్రాళ్ళ మీద చూపుతో మొదలై 
అమ్మ నాన్న నేర్పిన విలువలు మూట్టుకుని 
పాఠశాలలో ఆరగించిన చద్దన్న౦లా
  మోరల్ సైన్సు నేమరువేసుకుని 
నైతిక శాస్త్రం , ఆధ్యాత్మికతా  ఆకళింపు చేసుకుని 
ఆదర్శాల బాటలో పయణి౦చాలనే సంకల్పం
విలువల కోసం శ్రమ పరిధిని దాటి 
 తర తమ భేదం మరచి నిస్వార్ధాన్ని పూని 
        సేవకై నిలిచే నైజం 
 అన్ని కలగలసిన సూపర్ ఇగో   




రెంటి మధ్య సమతుల్యం 
ప్రాక్టిక్యాలిటి దీని నామధేయం 
దినచర్యకి అనుగుణంగా మెసలే ప్రాణం    
డబ్బుకి, జబ్బుకి దాసోహం  
అవసరం మేరకే శ్రమించే నైజం 
నిరంతర కష్ట నష్టాల సముదాయం 
                  ఇగో 


జగత్ గురువు బోధించిన తామసిక , రాజసిక, సాత్విక 
స్వభావాలకు నమూనాలు 
ఇడ్, ఇగో, సుపర్ ఇగోలు    


ఇడ్ నేనే అంతా అంటే 
సూపర్ ఇగో నువ్వెంతా దేవుని పాదరేణువంతా  అంటుంది 
ఇగో  స్టూప్ టు కాంన్కర్  అంటుంది  
మనో విజ్ఞాన శాస్త్రం మన జీవితమంతా
 చేతనా అచేతనా ప్రేరణాపూరితం అంటుంది 
                                                                        Psychoanalysis     


Sigmund Freud  

                                                                   
                                                             
                                             
Related Posts Plugin for WordPress, Blogger...